మారిషస్ లోని వివిధ ప్రాంతాల్ని బృందం సందర్శించడం, చర్చోపచర్చలు ఆసక్తికరంగా సాగుతాయి. విభిన్న వ్యక్తుల అనుభవాల్ని వివరిస్తూనే అంతస్సూత్రంగా రామాయణం సాగుతుంది. అందరి సమాగమానికి, చర్చలకు, పర్యటనలకు రామాయణమే కేంద్రం. ఇట్లాంటి క్లిష్టమయిన విషయాన్ని రచయిత్రి అనాయాసంగా, సహజంగా ఆవిష్కరించారు. ఎక్కడా ఈ నిర్వహణలో కృత్రిమత్వం కనిపించదు. వాల్మీకి రామాయణం, తులసీ రామాయణం, కంబ రామాయణం ఇట్లా ఎన్నో రామాయణాల్ని రచయిత్రి సోదాహరణంగా వివరిస్తారు. కథనానికి ఎక్కడా అవి ఆటంకంకావు. ప్రత్యేకించి తులసీ రామాయణం నుంచీ విరివిగా ఉదాహరణలు ఉన్నాయి. ఇవన్నీ సమావేశాల్లో, వివిధ ప్రాంతాల సందర్శనలో ప్రతినిధులు సందర్భోచితంగా వివరిస్తూ ఉంటారు.
అస్సామీ భాషలో రచింపబడిన ఈ ఉత్తమ నవలను ఉదాత్తంగా తెలుగువారి సొంతం చేసిన పాలకొడేటి కృష్ణమూర్తి గారు అభినందనీయులు. కొన్ని నవలలు తెలుగులో ఉన్నా అవి ఇతర భాషలవి అన్న స్పృహ పాఠకులకు ఉంటుంది. బొందపాటి శివరామకృష్ణ గారి శరత్ నవలలు బెంగాలీ నుంచే అనువాదాలయినా వాటిని మనం మన తెలుగు నవలలే అనుకుంటాం. కృష్ణమూర్తి గారు ఈ అస్సామీ నవలని ఆ స్థాయిలో తెలుగువారిదే అన్నంత ఆత్మీయంగా అనువదించారు.
- తనికెళ్ళ భరణి
మారిషస్ లోని వివిధ ప్రాంతాల్ని బృందం సందర్శించడం, చర్చోపచర్చలు ఆసక్తికరంగా సాగుతాయి. విభిన్న వ్యక్తుల అనుభవాల్ని వివరిస్తూనే అంతస్సూత్రంగా రామాయణం సాగుతుంది. అందరి సమాగమానికి, చర్చలకు, పర్యటనలకు రామాయణమే కేంద్రం. ఇట్లాంటి క్లిష్టమయిన విషయాన్ని రచయిత్రి అనాయాసంగా, సహజంగా ఆవిష్కరించారు. ఎక్కడా ఈ నిర్వహణలో కృత్రిమత్వం కనిపించదు. వాల్మీకి రామాయణం, తులసీ రామాయణం, కంబ రామాయణం ఇట్లా ఎన్నో రామాయణాల్ని రచయిత్రి సోదాహరణంగా వివరిస్తారు. కథనానికి ఎక్కడా అవి ఆటంకంకావు. ప్రత్యేకించి తులసీ రామాయణం నుంచీ విరివిగా ఉదాహరణలు ఉన్నాయి. ఇవన్నీ సమావేశాల్లో, వివిధ ప్రాంతాల సందర్శనలో ప్రతినిధులు సందర్భోచితంగా వివరిస్తూ ఉంటారు. అస్సామీ భాషలో రచింపబడిన ఈ ఉత్తమ నవలను ఉదాత్తంగా తెలుగువారి సొంతం చేసిన పాలకొడేటి కృష్ణమూర్తి గారు అభినందనీయులు. కొన్ని నవలలు తెలుగులో ఉన్నా అవి ఇతర భాషలవి అన్న స్పృహ పాఠకులకు ఉంటుంది. బొందపాటి శివరామకృష్ణ గారి శరత్ నవలలు బెంగాలీ నుంచే అనువాదాలయినా వాటిని మనం మన తెలుగు నవలలే అనుకుంటాం. కృష్ణమూర్తి గారు ఈ అస్సామీ నవలని ఆ స్థాయిలో తెలుగువారిదే అన్నంత ఆత్మీయంగా అనువదించారు. - తనికెళ్ళ భరణి© 2017,www.logili.com All Rights Reserved.