మనుస్మృతి
మనుధర్మ శాస్త్రము మానవ ధర్మసంహిత
ప్రథమాధ్యాయము
ఈ అధ్యాయంలో మొత్తం శ్లోకాల సంఖ్య - 78
సృష్ట్యుత్పత్తి-ధర్మోత్పత్తి విషయాలు
మహర్షులు మనువును సమీపించుట-
మనుమేకాగ్రమాసీనమభిగమ్య మహర్షయః |
ప్రతిపూజ్య యథాన్యాయమిదం వచనమబ్రువన్ II1
ఒనానొక సమయంలో మహర్షులంతా కలిసి ఏకాగ్రచిత్తంతో, నిశ్చలంగా ధ్యాన నిమగ్నుడై ఉన్న మనువును సమీపించి యధోచిత సత్కారం జరిపి ఇలా అన్నారు. ॥ 11॥ మహర్షులు వర్ణాశ్రమాల ధర్మాల గురించి మనువును ప్రశ్నించుట-
భగవన్సర్వవర్ణానాం యథావదనుపూర్వశః ।
అన్తరప్రభవాణాం చ ధర్మాన్నో వక్తుమర్హసి।।
"ఓ మహాత్మా! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే నాలుగు వర్ణాలవారికి సంబంధించినవీ; వారి అనులోమ విలోమ సంబంధాల వల్ల ఏర్పడిన వర్ణాలకు చెందినవీ అయిన ఆశ్రమాలను, వాటి ధర్మాలను మాకు యథాక్రమంగా కూలంకషంగా తెలియపరచండి." ॥2॥
త్వమేకో హ్యస్య సర్వస్య విధానస్య స్వయంభువః |
అచిన్త్యస్యాప్రమేయస్య కార్యతత్త్వార్థవిత్ప్రభో! ॥
వేదజ్ఞుడవైన ఓ మహర్షీ ! ఈ సమస్త జగత్తుకు ఆధారమై, ఆలోచనలకు అందనివాడు, అపరిమిత సత్యవిద్యలు కలవాడు అగు స్వయంభూ పరమాత్మ ద్వారా రచింపబడిన వేదాలలోని కర్తవ్యరూప ధర్మాలను, వాటి ప్రతిపాద్య విషయాలను యథార్థ స్వరూపాలను, రహస్యాలను తెలిసినవారు తమరొక్కరే. కాబట్టి మీరే మాకు అట్టి ధర్మాల గురించి వివరించుదురుగాక! ॥3॥
మహర్షులకు మనువు ప్రత్యుత్తరం
స తైః పృష్టస్తథా సమ్యగమితౌజా మహాత్మభిః |
ప్రత్యువాచార్య తాన్సర్వాన హర్షీబ్ర్భూయతామితి ॥.................
© 2017,www.logili.com All Rights Reserved.