సనాతాన భారతీయ సంస్కృతిలో గోవు ఓ అంతర్భాగామన్నది అందరికీ తెలిసిన సంగతే! పవిత్రతలోగాని, పనికొచ్చే అంశాల్లోగాని కామదేనువుతో సాటిరాగల ఏకైక జీవి - ఇలలో గోవు మాత్రమే!. వేదం పురాణ శాస్త్రాదులన్నీ శ్లాఘించిన గోమాత గొప్పతనం నేడు పెనుముప్పులో పడిందన్న విషయం విని, ధార్మిక జీవనులందరూ ముక్తకంఠంతో ఈ విపత్కర పరిస్థితి ఖండిస్తున్నారు. గోమాత ఉనికిని కాపాడటానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
కేవలం పూజార్హమైన జీవిగా గోవును అవసరార్ధం చూస్తే చాలదు. దాని మనుగడకు వాటిల్లే విపత్కర పరిణామాలనుంచి దాన్ని రక్షించాలి. గోసంతతిని వృద్ధి చెందించడానికి అవసరమైన వనరులన్నీ సమీకరించ గలగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే గోవును ఆరాధించే - ప్రేమించే వారంతా గో సంపదవృద్ధికి తమ వంతు సహకారాన్ని అందజేయగలగాలి. 'తిరుమల తిరుపతి, శ్రీశైలం, తదితర దేవస్థానాల వారిదే ఈ బాధ్యత' అనుకోకుండా ప్రతివారూ గోసేవ సంరక్షణదక్షులై నిలిచిననాడే ఈ సత్సంకల్పం సాధ్యమవుతుంది. ఈ పుస్తకం ఆ దిశగా మిమ్మల్ని చైతన్యపరచగల్గితే మా లక్ష్యం నెరవేరినట్లే!
సనాతాన భారతీయ సంస్కృతిలో గోవు ఓ అంతర్భాగామన్నది అందరికీ తెలిసిన సంగతే! పవిత్రతలోగాని, పనికొచ్చే అంశాల్లోగాని కామదేనువుతో సాటిరాగల ఏకైక జీవి - ఇలలో గోవు మాత్రమే!. వేదం పురాణ శాస్త్రాదులన్నీ శ్లాఘించిన గోమాత గొప్పతనం నేడు పెనుముప్పులో పడిందన్న విషయం విని, ధార్మిక జీవనులందరూ ముక్తకంఠంతో ఈ విపత్కర పరిస్థితి ఖండిస్తున్నారు. గోమాత ఉనికిని కాపాడటానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కేవలం పూజార్హమైన జీవిగా గోవును అవసరార్ధం చూస్తే చాలదు. దాని మనుగడకు వాటిల్లే విపత్కర పరిణామాలనుంచి దాన్ని రక్షించాలి. గోసంతతిని వృద్ధి చెందించడానికి అవసరమైన వనరులన్నీ సమీకరించ గలగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే గోవును ఆరాధించే - ప్రేమించే వారంతా గో సంపదవృద్ధికి తమ వంతు సహకారాన్ని అందజేయగలగాలి. 'తిరుమల తిరుపతి, శ్రీశైలం, తదితర దేవస్థానాల వారిదే ఈ బాధ్యత' అనుకోకుండా ప్రతివారూ గోసేవ సంరక్షణదక్షులై నిలిచిననాడే ఈ సత్సంకల్పం సాధ్యమవుతుంది. ఈ పుస్తకం ఆ దిశగా మిమ్మల్ని చైతన్యపరచగల్గితే మా లక్ష్యం నెరవేరినట్లే!
© 2017,www.logili.com All Rights Reserved.