అపూర్వం అంటే పూర్వం లేనిది. ఇప్పటి నుంచే ఉన్నదిఅంటే క్రొత్తది అని మామూలుగా అనుకొంటాము. దీనికి పూర్వం ముందు ఏదీలేదు. ఇదే ఉన్నది. అంటే మొదటినుంచి ఉన్నది అనాది అని కుడా, గమనించదగియున్నది. అలాగే అదృష్టం అంటే భాగ్యం - అనుకోకుండా కలిగినది. లేదా ఇది కలగడానికి గల కారణం కనిపించనిది. అనగా అతర్కితమైనది అని భావిస్తాము. దృష్టం అంటే చూడబడినది. అదృష్టం చూడబడినది. ఉన్నది కాని మనం దానిని ఇప్పుడే చూస్తున్నాము అని కూడా చెప్పుకోవచ్చు.
ఇలాంటి దిగ్బ్రాంతి బ్రహ్మశ్రీ కూచివీరభద్రశర్మగారి - "మహాన్యాస పూర్వక - సశాస్త్రీయ రుద్రాభిషేక విధి" అనే గ్రంధాన్ని చదివినప్పుడు నాకు కలిగింది. తెలిసినట్లుగా ఉంటుంది. కానీ ప్రతివిషయమూ క్రొత్తగా తెలిసినట్లుగా అనిపిస్తుంది. ఉత్ఖంటతో విడవకుండా ఆ గ్రంధాన్ని చాలాసార్లు చదువగా చదువగా శ్రీకూచివీరభాద్రశర్మగారు ఒక వ్యక్తి కాదు. ఒక మహా వ్యవస్థ అని అనిపించింది.ఆ గ్రంథం నుండి గ్రహించవలసింది చాలా ఉంది. అలా అలా చాలా గ్రంధాలు చదవడం జరిగింది. అలా చదివిన గ్రంధములు, పరిశీలించిన గ్రంధములు అని విడిగా పేర్కొనడం జరిగింది. అప్పటికి "శివారాధన", "హరహర మహాదేవ" వ్రాయడం జరిగింది. మహాన్యాసాన్ని తెలుసుకోవాలన్న ఆలోచన వలన "సప్రయోగ - ఆంధ్ర రుద్రభాష్యములు" అందించడం జరిగింది. నమక మంత్రాలని అర్ధంకాని మూఢ భక్తితో శ్రద్దాసక్తితో వినడం తప్ప మరేమీ తెలియని నేను. ఇంతవరకు ఇలా వ్రాసే పరిస్థితికి రావడం శివానుగ్రహం తప్ప మరేమీ కాదు.
ఈ గ్రంధానికి "నమశివాయ ఓం" అని పేరు పెట్టడం జరిగింది. ఓం నమశ్శివాయ అనే మంత్రము, నమశ్శివాయ ఓం అనే మంత్రము రెండును ఉన్నాయి. నమశ్శివాయ స్థూలపంచాక్షరి. ఓం సూక్ష్మ పంచాక్షరి. మనం సూక్ష్మంలోంచి స్థూలం లోనికి వచ్చాము. ఓంకారం నుండే ఈ పంచభౌతికమైన , శివమయమైన ఈ స్తూలప్రపంచంలోనికి వచ్చాము. స్థూలం అంటే సూక్ష్మంలోనికి ప్రవేశించునట్లు అనుగ్రహించవలెను. అనే కోరికతో ముక్తిని కోరుతూ నమశ్శివాయ - ఓం అనే పేరు ఉంచడమైంది.
ఇందులో "1.శివుని వైభవం, 2.శివార్చనా నియమాలు, 3.శివార్పిత ద్రవ్యఫలములు, 4.శివార్పిత పత్రపుష్పఫల - ఫలములు, 5.ముద్రలు, 6.శివపూజ అంతరార్ధము" అనే ఆరు విషయాలు నమశ్శివాయ ఓం లోని భాగములుగా భావించడం జరిగింది. స్వయంగా చేసుకోగల పార్ధివ లింగార్చనలు రెండు విధాలను ఇవ్వడం జరిగింది. ఇలాంటి గ్రంథం ఈ మధ్యకాలంలో యిలాటి ఇన్ని విషయాలతో ఇలా రాలేదని అనుకుంటున్నాను.
శ్రీమహావిష్ణువునకు దశావతారాలు, మరికొన్ని అవతారాలు ప్రసిద్ధములు. శివునకు 25 లీలలు (పంచవింశతి లీలలు) వాని స్తుతులు, 24 తత్వాలు - పంచభూతములు, 5 విషయ తన్మాత్రాపంచకము శబ్దాదులు 5, వాక్ - పాణి ఆది కర్మేంద్రియ పంచకము, 5 శ్రోత్రాదిజ్ఞానేంద్రియ పంచకము 5, మనోబుద్ది అహంకార/ప్రకృతి చతుష్టయం 4-24 మరియు పురుషుడు 1=25 తత్వములకు ప్రతీకలు అని పెద్దలమాట యివ్వబడింది. లీలల విషయంలో మతాంతరములు ఉండడం వలన పంచవింశతి లీలాస్తుతిలోని శ్లోకములు 25 సంఖ్యను మించినవి. ఇది దుర్లభమైన - అరుదైన "శివస్తుతి".
' సర్వం శివమయం జగత్ '
- శ్రీ మల్లంపల్లి దుర్గామల్లికార్జున ప్రసాద్ శాస్త్రి
అపూర్వం అంటే పూర్వం లేనిది. ఇప్పటి నుంచే ఉన్నదిఅంటే క్రొత్తది అని మామూలుగా అనుకొంటాము. దీనికి పూర్వం ముందు ఏదీలేదు. ఇదే ఉన్నది. అంటే మొదటినుంచి ఉన్నది అనాది అని కుడా, గమనించదగియున్నది. అలాగే అదృష్టం అంటే భాగ్యం - అనుకోకుండా కలిగినది. లేదా ఇది కలగడానికి గల కారణం కనిపించనిది. అనగా అతర్కితమైనది అని భావిస్తాము. దృష్టం అంటే చూడబడినది. అదృష్టం చూడబడినది. ఉన్నది కాని మనం దానిని ఇప్పుడే చూస్తున్నాము అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి దిగ్బ్రాంతి బ్రహ్మశ్రీ కూచివీరభద్రశర్మగారి - "మహాన్యాస పూర్వక - సశాస్త్రీయ రుద్రాభిషేక విధి" అనే గ్రంధాన్ని చదివినప్పుడు నాకు కలిగింది. తెలిసినట్లుగా ఉంటుంది. కానీ ప్రతివిషయమూ క్రొత్తగా తెలిసినట్లుగా అనిపిస్తుంది. ఉత్ఖంటతో విడవకుండా ఆ గ్రంధాన్ని చాలాసార్లు చదువగా చదువగా శ్రీకూచివీరభాద్రశర్మగారు ఒక వ్యక్తి కాదు. ఒక మహా వ్యవస్థ అని అనిపించింది.ఆ గ్రంథం నుండి గ్రహించవలసింది చాలా ఉంది. అలా అలా చాలా గ్రంధాలు చదవడం జరిగింది. అలా చదివిన గ్రంధములు, పరిశీలించిన గ్రంధములు అని విడిగా పేర్కొనడం జరిగింది. అప్పటికి "శివారాధన", "హరహర మహాదేవ" వ్రాయడం జరిగింది. మహాన్యాసాన్ని తెలుసుకోవాలన్న ఆలోచన వలన "సప్రయోగ - ఆంధ్ర రుద్రభాష్యములు" అందించడం జరిగింది. నమక మంత్రాలని అర్ధంకాని మూఢ భక్తితో శ్రద్దాసక్తితో వినడం తప్ప మరేమీ తెలియని నేను. ఇంతవరకు ఇలా వ్రాసే పరిస్థితికి రావడం శివానుగ్రహం తప్ప మరేమీ కాదు. ఈ గ్రంధానికి "నమశివాయ ఓం" అని పేరు పెట్టడం జరిగింది. ఓం నమశ్శివాయ అనే మంత్రము, నమశ్శివాయ ఓం అనే మంత్రము రెండును ఉన్నాయి. నమశ్శివాయ స్థూలపంచాక్షరి. ఓం సూక్ష్మ పంచాక్షరి. మనం సూక్ష్మంలోంచి స్థూలం లోనికి వచ్చాము. ఓంకారం నుండే ఈ పంచభౌతికమైన , శివమయమైన ఈ స్తూలప్రపంచంలోనికి వచ్చాము. స్థూలం అంటే సూక్ష్మంలోనికి ప్రవేశించునట్లు అనుగ్రహించవలెను. అనే కోరికతో ముక్తిని కోరుతూ నమశ్శివాయ - ఓం అనే పేరు ఉంచడమైంది. ఇందులో "1.శివుని వైభవం, 2.శివార్చనా నియమాలు, 3.శివార్పిత ద్రవ్యఫలములు, 4.శివార్పిత పత్రపుష్పఫల - ఫలములు, 5.ముద్రలు, 6.శివపూజ అంతరార్ధము" అనే ఆరు విషయాలు నమశ్శివాయ ఓం లోని భాగములుగా భావించడం జరిగింది. స్వయంగా చేసుకోగల పార్ధివ లింగార్చనలు రెండు విధాలను ఇవ్వడం జరిగింది. ఇలాంటి గ్రంథం ఈ మధ్యకాలంలో యిలాటి ఇన్ని విషయాలతో ఇలా రాలేదని అనుకుంటున్నాను. శ్రీమహావిష్ణువునకు దశావతారాలు, మరికొన్ని అవతారాలు ప్రసిద్ధములు. శివునకు 25 లీలలు (పంచవింశతి లీలలు) వాని స్తుతులు, 24 తత్వాలు - పంచభూతములు, 5 విషయ తన్మాత్రాపంచకము శబ్దాదులు 5, వాక్ - పాణి ఆది కర్మేంద్రియ పంచకము, 5 శ్రోత్రాదిజ్ఞానేంద్రియ పంచకము 5, మనోబుద్ది అహంకార/ప్రకృతి చతుష్టయం 4-24 మరియు పురుషుడు 1=25 తత్వములకు ప్రతీకలు అని పెద్దలమాట యివ్వబడింది. లీలల విషయంలో మతాంతరములు ఉండడం వలన పంచవింశతి లీలాస్తుతిలోని శ్లోకములు 25 సంఖ్యను మించినవి. ఇది దుర్లభమైన - అరుదైన "శివస్తుతి". ' సర్వం శివమయం జగత్ ' - శ్రీ మల్లంపల్లి దుర్గామల్లికార్జున ప్రసాద్ శాస్త్రి© 2017,www.logili.com All Rights Reserved.