ఈమధ్య కాలంలో భారతదేశంలోని ముస్లింలపై దాడులు చేయడం, హింసించడం ఒక పరిపాటిగా మారి అందుకు కారణం గొడ్డుమాంసం తినడంగా చెప్తున్నారు. హిందువులే అధికంగా ఉన్న ఒక లౌకిక రాజ్యంలో ఇది ఆహారపు అలవాట్లు పై చర్చకు తెరతీసింది. మాంసాహారం కన్నా శాఖాహారం గొప్పదా? మాంసాహారంలో కూడా గొడ్డుమాంసం తినడం పాపమా? ఇందుకేమైన ఆధారాలున్నాయా? ఇది నిజంగా శిక్షార్హమైన నేరమేనా? హిందూ మతోన్మాదులు చెప్తున్నట్టు గతమంతా హిందువులు పూర్తి శాఖాహారులా? మాంసాహారం భుజించడం నీచమా? రాజ్యాంగం భారతీయ పౌరుడికిచ్చిన సమానత్వం మాటేమిటి?.
ఈ ప్రశ్నలకు ఎన్నో ప్రామాణిక సంస్కృత గ్రంథాలు, శృతులు, స్మృతులు ఉంటంకిస్తూ ప్రముఖ చరిత్రకారుడు శ్రీ డి ఎన్ ఝా ఎంతో శ్రమకూర్చి మతవాదులు తమ రాజకీయ అవసరాల కోసం 'గోవును' పట్టుకుని ఎలా వేళ్లాడుతున్నారో వివరించారు. ఇది సాధారణంగా మత సహనానికి పేరున్న దేశంలో, ఒక భయంకర అసహన పరిస్థితులకు దారి తీస్తున్నది.
ఈ పుస్తకం ముఖ్యంగా హిందూ, బౌద్ధ, జైన మత గ్రంథాల ఆధారంగా వ్రాయబడింది. క్రీ పూ 1500 నుండి 600 మధ్య వెలుగు చూసిన వేదాలు, స్మృతులు, ధర్మసూత్రాలూ, పురాణాలు, మతవ్యాఖ్యానాలు మొదలైన వాటి ఆధారంగానే బ్రాహ్మణులు క్రతువులు, పూజలు, తంతలు, తతంగాలు రూపొందిస్తుంటారు. సంస్కృతంలోనూ, పాళీలోనూ ఉన్న అనేక రచనల ద్వారా ఆనాడు మాంస భక్షణ సర్వసాధారణమని, గొడ్డుమాంసం ప్రసస్థంగా భావించేవారని అర్థమవుతుంది. హిందూ, బౌద్ధ గ్రంథాల కన్నా జైన గ్రంథాలలో గొడ్డుమాంసం గురించి తక్కువగా వ్రాయబడింది. డి ఎన్ ఝా వీటన్నింటి నుంచి ఉటుంకించారు.
ఈమధ్య కాలంలో భారతదేశంలోని ముస్లింలపై దాడులు చేయడం, హింసించడం ఒక పరిపాటిగా మారి అందుకు కారణం గొడ్డుమాంసం తినడంగా చెప్తున్నారు. హిందువులే అధికంగా ఉన్న ఒక లౌకిక రాజ్యంలో ఇది ఆహారపు అలవాట్లు పై చర్చకు తెరతీసింది. మాంసాహారం కన్నా శాఖాహారం గొప్పదా? మాంసాహారంలో కూడా గొడ్డుమాంసం తినడం పాపమా? ఇందుకేమైన ఆధారాలున్నాయా? ఇది నిజంగా శిక్షార్హమైన నేరమేనా? హిందూ మతోన్మాదులు చెప్తున్నట్టు గతమంతా హిందువులు పూర్తి శాఖాహారులా? మాంసాహారం భుజించడం నీచమా? రాజ్యాంగం భారతీయ పౌరుడికిచ్చిన సమానత్వం మాటేమిటి?. ఈ ప్రశ్నలకు ఎన్నో ప్రామాణిక సంస్కృత గ్రంథాలు, శృతులు, స్మృతులు ఉంటంకిస్తూ ప్రముఖ చరిత్రకారుడు శ్రీ డి ఎన్ ఝా ఎంతో శ్రమకూర్చి మతవాదులు తమ రాజకీయ అవసరాల కోసం 'గోవును' పట్టుకుని ఎలా వేళ్లాడుతున్నారో వివరించారు. ఇది సాధారణంగా మత సహనానికి పేరున్న దేశంలో, ఒక భయంకర అసహన పరిస్థితులకు దారి తీస్తున్నది. ఈ పుస్తకం ముఖ్యంగా హిందూ, బౌద్ధ, జైన మత గ్రంథాల ఆధారంగా వ్రాయబడింది. క్రీ పూ 1500 నుండి 600 మధ్య వెలుగు చూసిన వేదాలు, స్మృతులు, ధర్మసూత్రాలూ, పురాణాలు, మతవ్యాఖ్యానాలు మొదలైన వాటి ఆధారంగానే బ్రాహ్మణులు క్రతువులు, పూజలు, తంతలు, తతంగాలు రూపొందిస్తుంటారు. సంస్కృతంలోనూ, పాళీలోనూ ఉన్న అనేక రచనల ద్వారా ఆనాడు మాంస భక్షణ సర్వసాధారణమని, గొడ్డుమాంసం ప్రసస్థంగా భావించేవారని అర్థమవుతుంది. హిందూ, బౌద్ధ గ్రంథాల కన్నా జైన గ్రంథాలలో గొడ్డుమాంసం గురించి తక్కువగా వ్రాయబడింది. డి ఎన్ ఝా వీటన్నింటి నుంచి ఉటుంకించారు.© 2017,www.logili.com All Rights Reserved.