మనిషికే కాక కష్టాలు జంతువులకూ వస్తుంటాయి. చెట్టు - చేమలు, రాయి - రప్పలు, అందుకు మినహాయింపు కాదు. వంట చెరకుగా, కలపగా వృక్షసముదాయాలు విధ్వంసానికి గురికాగా - కొండరాళ్ళూ, బండలు కూలీల సుత్తి దెబ్బలకు గురై కంకరగా, పిండిగా మారుతాయి. మనసున్న కారణంగా మనిషిని శారీరక బాధలే కాక, మానసిక సామవేదనలు కూడా పలకరిస్తాయి. అయితే మనిషికి ఓ ప్రత్యేకత ఉంది. శరీర బాధలు సరేసరి! మానసిక క్లేశాలను మనిషి జపధ్యానాది ప్రక్రియల ద్వారా నివారించుకొని స్వాంతన పొందుతాడు.
ధ్యాన ప్రక్రియ పూర్తిగా దైవ సంబంధమైనది కాకపోయినా, జపతపాలు భగవధన్వేషణ కోసం చేసేవే! మనిషి దైవాన్ని పొందినా, లేకున్నా అతడి దైవం గురించిన ఆలోచనలు మొదట అతడికి ఆనందాన్ని ప్రసాదిస్తాయి. ఆత్మ ఆనందస్వరూపం! అందుకే భగవంతుడితో మనిషి సంబంధాన్ని 'ఆధ్యాత్మికం' అన్నారు. మానవుడికి శక్తిని, నూతనోత్తేజాన్నీ ప్రసాదించి అతడి మానసిక, శారీరక స్థితిగతులను పవిత్రీకరించే మహత్తర సాధనం 'ఆధ్యాత్మికం'.
ఈ చిన్ని పుస్తకంలో వివిధ అంశాలకు సంబంధించిన ఆధ్యాత్మిక వ్యాసాలూ చోటు చేసుకోవడం జరిగింది. ఈ సంకలనంలోని వ్యాసాలూ 'ఆంధ్రభూమి', 'ఆంధ్రప్రభ', సాక్షి ద్యానమాలిక వంటి పత్రికలలో ప్రచురితమైనవి, కొన్ని అముద్రితాలు కూడా కలిపి ప్రచురించడం జరిగింది. నన్ను ఆదరించిన ఆయా పత్రికల సంపాదకులకు మనఃపూర్వక కృతజ్ఞతాభివాదాలు వినమ్రంగా తెలుపుకుంటున్నాను.
మనిషికే కాక కష్టాలు జంతువులకూ వస్తుంటాయి. చెట్టు - చేమలు, రాయి - రప్పలు, అందుకు మినహాయింపు కాదు. వంట చెరకుగా, కలపగా వృక్షసముదాయాలు విధ్వంసానికి గురికాగా - కొండరాళ్ళూ, బండలు కూలీల సుత్తి దెబ్బలకు గురై కంకరగా, పిండిగా మారుతాయి. మనసున్న కారణంగా మనిషిని శారీరక బాధలే కాక, మానసిక సామవేదనలు కూడా పలకరిస్తాయి. అయితే మనిషికి ఓ ప్రత్యేకత ఉంది. శరీర బాధలు సరేసరి! మానసిక క్లేశాలను మనిషి జపధ్యానాది ప్రక్రియల ద్వారా నివారించుకొని స్వాంతన పొందుతాడు. ధ్యాన ప్రక్రియ పూర్తిగా దైవ సంబంధమైనది కాకపోయినా, జపతపాలు భగవధన్వేషణ కోసం చేసేవే! మనిషి దైవాన్ని పొందినా, లేకున్నా అతడి దైవం గురించిన ఆలోచనలు మొదట అతడికి ఆనందాన్ని ప్రసాదిస్తాయి. ఆత్మ ఆనందస్వరూపం! అందుకే భగవంతుడితో మనిషి సంబంధాన్ని 'ఆధ్యాత్మికం' అన్నారు. మానవుడికి శక్తిని, నూతనోత్తేజాన్నీ ప్రసాదించి అతడి మానసిక, శారీరక స్థితిగతులను పవిత్రీకరించే మహత్తర సాధనం 'ఆధ్యాత్మికం'. ఈ చిన్ని పుస్తకంలో వివిధ అంశాలకు సంబంధించిన ఆధ్యాత్మిక వ్యాసాలూ చోటు చేసుకోవడం జరిగింది. ఈ సంకలనంలోని వ్యాసాలూ 'ఆంధ్రభూమి', 'ఆంధ్రప్రభ', సాక్షి ద్యానమాలిక వంటి పత్రికలలో ప్రచురితమైనవి, కొన్ని అముద్రితాలు కూడా కలిపి ప్రచురించడం జరిగింది. నన్ను ఆదరించిన ఆయా పత్రికల సంపాదకులకు మనఃపూర్వక కృతజ్ఞతాభివాదాలు వినమ్రంగా తెలుపుకుంటున్నాను.© 2017,www.logili.com All Rights Reserved.