ఈ కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహానిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యల్ని సులభంగా పొందగలరు.
ఈ దశమహావిద్యలలో ఒక్కొక్కరికి ఒక్కోవిద్యపై అభిమానం ఉంటుంది. ఈ పుస్తకంలో శ్రీతారాసాధన అనే ఈ పుస్తకం ద్వారా శ్రీతారాదేవి గురించి, వివిధ రకాలైన తారామంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతులు గురించి, శ్రీతారాదేవి అష్టోత్తర సహస్త్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంధాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకలంగా మీకందిస్తున్నారు.
శ్రీ తారాదేవి దశమహావిద్యలలో రెండవ మహావిద్య. నీలవర్ణంతో భాసించే ఈ విద్యకు చైత్రమాసం శుక్లపక్షనవమీతిధి ప్రీతిపాత్రమైనది. శ్రీ తారాదేవి వాక్కుకి అధిదేవత. ఈమెనే నీలసరస్వతి అని కూడా అంటారు. ఈ తారాదేవి భక్తీ శ్రద్ధలతో ఉపాసించటం వల్ల సాధకుడికి వాక్సిద్ధి, శత్రునాశనం, దివ్యజ్ఞానం, కష్టనివారణ కలుగుతుంది. స్వర్ణతారా మంత్ర ఉపాసన ద్వారా అమితమైన ఐశ్వర్యం కూడా లభిస్తుంది. శ్రీ తారాసాధన చేసి దేవి కృపకు పాత్రులుకాగలరని కోరుకుంటున్నాం.
- జయంతి చక్రవర్తి
ఈ కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహానిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యల్ని సులభంగా పొందగలరు. ఈ దశమహావిద్యలలో ఒక్కొక్కరికి ఒక్కోవిద్యపై అభిమానం ఉంటుంది. ఈ పుస్తకంలో శ్రీతారాసాధన అనే ఈ పుస్తకం ద్వారా శ్రీతారాదేవి గురించి, వివిధ రకాలైన తారామంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతులు గురించి, శ్రీతారాదేవి అష్టోత్తర సహస్త్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంధాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకలంగా మీకందిస్తున్నారు. శ్రీ తారాదేవి దశమహావిద్యలలో రెండవ మహావిద్య. నీలవర్ణంతో భాసించే ఈ విద్యకు చైత్రమాసం శుక్లపక్షనవమీతిధి ప్రీతిపాత్రమైనది. శ్రీ తారాదేవి వాక్కుకి అధిదేవత. ఈమెనే నీలసరస్వతి అని కూడా అంటారు. ఈ తారాదేవి భక్తీ శ్రద్ధలతో ఉపాసించటం వల్ల సాధకుడికి వాక్సిద్ధి, శత్రునాశనం, దివ్యజ్ఞానం, కష్టనివారణ కలుగుతుంది. స్వర్ణతారా మంత్ర ఉపాసన ద్వారా అమితమైన ఐశ్వర్యం కూడా లభిస్తుంది. శ్రీ తారాసాధన చేసి దేవి కృపకు పాత్రులుకాగలరని కోరుకుంటున్నాం. - జయంతి చక్రవర్తి© 2017,www.logili.com All Rights Reserved.