సూర్యుడు అంతటా ఉన్నాడు. మన దేశంలో ఎండలు ఎక్కువే. ఎండల వల్ల చెమటలు పడుతున్నాయని విసుక్కోవటమే కాదు. దానితో వంట చేసుకోవచ్చు, దీపాలు వెలిగించుకోవచ్చు. బాగా ఎండగా ఉన్న రోజున 150 * 150 సెంటీమీటర్ల వైశాల్యంలో పడే ఎండతో గ్యాస్ పొయ్యి పెద్ద మంటతో కంటే ఎక్కువ వేడిని పొందవచ్చు. ఆ సౌరశక్తినంతటినీ ఒకచోటికి కేంద్రీకరించగలిగితే ఏ కట్టెపుల్లలూ, ఇంధనం లేకుండా వంట చేసుకోవచ్చు. పవన శక్తిలో మన దేశం గణనీయమైన ప్రగతి సాధించింది. సుజ్ లాన్ అన్న ఒక్క ప్రైవేటు కంపెనీ ఆరువేల మెగావాట్ల శక్తి సామర్థ్యాన్ని నెలకొల్పింది. భారత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల, పన్ను మినహాయింపుల వల్ల, సానుకూల వాతావరణాన్ని కల్పించడం వల్ల ఇది సాధ్యమవుతుంది. సౌర శక్తికి కూడా ఇటువంటి అవకాశాలు ఇవ్వాలి.
సూర్యుడు అంతటా ఉన్నాడు. మన దేశంలో ఎండలు ఎక్కువే. ఎండల వల్ల చెమటలు పడుతున్నాయని విసుక్కోవటమే కాదు. దానితో వంట చేసుకోవచ్చు, దీపాలు వెలిగించుకోవచ్చు. బాగా ఎండగా ఉన్న రోజున 150 * 150 సెంటీమీటర్ల వైశాల్యంలో పడే ఎండతో గ్యాస్ పొయ్యి పెద్ద మంటతో కంటే ఎక్కువ వేడిని పొందవచ్చు. ఆ సౌరశక్తినంతటినీ ఒకచోటికి కేంద్రీకరించగలిగితే ఏ కట్టెపుల్లలూ, ఇంధనం లేకుండా వంట చేసుకోవచ్చు. పవన శక్తిలో మన దేశం గణనీయమైన ప్రగతి సాధించింది. సుజ్ లాన్ అన్న ఒక్క ప్రైవేటు కంపెనీ ఆరువేల మెగావాట్ల శక్తి సామర్థ్యాన్ని నెలకొల్పింది. భారత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల, పన్ను మినహాయింపుల వల్ల, సానుకూల వాతావరణాన్ని కల్పించడం వల్ల ఇది సాధ్యమవుతుంది. సౌర శక్తికి కూడా ఇటువంటి అవకాశాలు ఇవ్వాలి.preethi
© 2017,www.logili.com All Rights Reserved.