మానవులకు ఉన్న అన్ని సామర్థ్యాల్లోనూ నేర్పుగా నెగ్గుకురావటం
అనేది అధిక ప్రతిఫలాన్ని అందిస్తుంది.
మీలో ఆ సామర్థ్యం ఉందా?
ఈ పుస్తకం ఉపాధి, ఉద్యోగ రంగాల్లో విజయవంతం కావటానికి, సామాజిక సంబంధాలను , కుటుంబ సంబంధాలను మెరుగుపరుచుకోవటానికి మీకు దారి చూపుతుంది. ఇందులో చెప్పిన చిట్కాలను అనుసరిస్తే క్షణాల్లో మీరు కొత్త వ్యక్తులను కలుసుకోగలుగుతారు. కొత్త ఒప్పందాలను అమలు చేయగలుగుతారు. కళ్లు మూసి తెరిచేటంతలో ఒక పెద్ద సమూహాన్నే అబ్బురపరచగలుగుతారు. ప్రజలను ఆకట్టుకోగల నైపుణ్యాలు మీకున్నాయో లేదో ముందుగా పరిశీలించుకోండి. ఈ పుస్తకంలో ఇచ్చిన 10 ప్రశ్నలకు సమాధానాలు చదివితే మీకు ఏ నైపుణ్యాలు అవసరమో అర్థమవుతుంది. “నిజజీవితంలో సవాళ్లు” అన్న అధ్యాయాన్ని చదివితే మీకు సవాలుగా నిలిచిన సమస్యలకు సలహాలు దొరుకుతాయి. మీరు ఇంటర్య్యూలను సులువుగా ఎదుర్కోగలుగుతారు. మీ బంధువుల పెళ్లిలో నలుగురి ఎదుటా గడగడా మాట్లాడగలుగుతారు. - లెస్ గిబ్లిన్, మానవ సంబంధాలు, అమ్మకాల రంగాల్లో నిపుణుడు. వ్యక్తిగత సంబంధాలను పెంచుకుంటూ ఇతరులతో ఎలా మెలగాలో, మన పలుకుబడిని ఎలా పెంచుకోవాలో, ఇతరులు మనం చెప్పేది శ్రద్ధగా వినేలా ఎలా చేసుకోవాలో వివరిస్తారు. నేర్పుగా నెగ్గుకురావటం ఎలా? పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల కాపీలకు పైగా అమ్ముడయ్యింది. 20 భాషల్లో అనువాదమయింది.
© 2017,www.logili.com All Rights Reserved.