"మొత్తం సమాజాన్ని మార్చటం నాకు చేతకాదని - నాకు చేతనైంది కూడా నేను చెయ్యొద్దా? అలా చెయ్యకుండా నేను బతకలేనని నాకు తెలిసిపోయింది. ఆ పనిలో నన్ను నేను నిరూపించుకుంటున్నాను. దానివల్ల నాకెంతో తృప్తి. నా జీవితం సార్థకమవుతోందన్న భావం. ఆ భావం కలగటమే స్వేచ్ఛకు అర్థం కాదూ? నా బతుకు మాత్రమే నేను బతకటానికయితే నాకీ స్వేచ్ఛ అక్కర్లేదు. నా స్వేచ్ఛకు ఒక అర్థం ఉండాలి. ఆ అర్థం కోసం అన్వేషించటమే ఇప్పుడు నాపని."
"మనలాంటి వాళ్ళ స్వేచ్ఛకోసం ఏమీ చెయ్యకపోతే మన స్వేచ్ఛకు అర్థమేముంది?" 'నాకు ప్రపంచంతో సజీవ సంబంధం కావాలి. నా ఉనికివల్ల సమాజానికేదో చలనం ఉండాలి.' "మన జీవితాల్లోనయినా వాటి చుట్టూ వుండే సమాజంలోనయినా వాటి చలన సూత్రాలను అన్వేషించడమే అవశ్యకత. ఆ అవశ్యకతను గుర్తించడమే స్వేచ్ఛ. ఆ అన్వేషణ దశలో - స్వేచ్ఛ నవలలోని అరుణ జీవితంలోలా సంక్షోభమూ ఉంది. సంఘర్షణ ఉంది. ఆవశ్యకతను గుర్తించిన తర్వాత - స్వేఛ్చానంతర జీవితంలో సంఘర్షణే గాని సంక్షోభం వుండే అవకాశం లేదు."
"మొత్తం సమాజాన్ని మార్చటం నాకు చేతకాదని - నాకు చేతనైంది కూడా నేను చెయ్యొద్దా? అలా చెయ్యకుండా నేను బతకలేనని నాకు తెలిసిపోయింది. ఆ పనిలో నన్ను నేను నిరూపించుకుంటున్నాను. దానివల్ల నాకెంతో తృప్తి. నా జీవితం సార్థకమవుతోందన్న భావం. ఆ భావం కలగటమే స్వేచ్ఛకు అర్థం కాదూ? నా బతుకు మాత్రమే నేను బతకటానికయితే నాకీ స్వేచ్ఛ అక్కర్లేదు. నా స్వేచ్ఛకు ఒక అర్థం ఉండాలి. ఆ అర్థం కోసం అన్వేషించటమే ఇప్పుడు నాపని." "మనలాంటి వాళ్ళ స్వేచ్ఛకోసం ఏమీ చెయ్యకపోతే మన స్వేచ్ఛకు అర్థమేముంది?" 'నాకు ప్రపంచంతో సజీవ సంబంధం కావాలి. నా ఉనికివల్ల సమాజానికేదో చలనం ఉండాలి.' "మన జీవితాల్లోనయినా వాటి చుట్టూ వుండే సమాజంలోనయినా వాటి చలన సూత్రాలను అన్వేషించడమే అవశ్యకత. ఆ అవశ్యకతను గుర్తించడమే స్వేచ్ఛ. ఆ అన్వేషణ దశలో - స్వేచ్ఛ నవలలోని అరుణ జీవితంలోలా సంక్షోభమూ ఉంది. సంఘర్షణ ఉంది. ఆవశ్యకతను గుర్తించిన తర్వాత - స్వేఛ్చానంతర జీవితంలో సంఘర్షణే గాని సంక్షోభం వుండే అవకాశం లేదు."I want to buy this book...pls inform me when the book is available...
© 2017,www.logili.com All Rights Reserved.