కొండంత అనుభవాన్నీ, విజ్ఞానాన్నీ గోరంత ప్రమాణంలో ఉన్న సూక్తులు, హితోక్తులు తమలో ఇముడ్చుకుంటాయి. ఒక చిన్నవిత్తనం మహావృక్షమై, ఫలాలను అందించినట్లే, సూక్తులు గోచరిస్తాయి. సుభాషితాలకు, హితవాక్యాలకు ఉన్న శక్తి దేనికీ ఉండదు. అవి సూక్ష్మ రూపంలో ఉన్నా, అజ్ఞానాన్ని పారద్రోలి, అనుభవాన్ని పండించుకోవడానికి ఉపకరిస్తాయి. ఈ హితవాక్యాలను హృదయంలో పదిలపరచుకున్నవారు సర్వశక్తి సంపన్నులవుతారు. ఔషధం చేదుగా ఉన్నా రోగాన్ని దూరం చేసి, ఆరోగ్యవంతునిగా చేస్తుంది. హితం చెప్పేవారు నూటికీ కోటికీ ఉంటారు. సత్యంలా హితోక్తులు తెలిసినట్టు అనిపించినా, ఎవరికీ పూర్తిగా తెలియవు. జ్ఞానులు మాత్రమే సూక్ష్మసత్యస్పృహ కలిగియుంటారు. మహనీయులు చెప్పిన హితోక్తులు ఏదేశ, కాల, పరిస్థితుల్లోనైనా మానవాళికి ఉపయుక్తమవుతాయి. మనిషి మనస్సు అశాంతి, అలజడి, ఆందోళనతో నిండియున్నప్పుడు వీటిని పఠిస్తే కాసింత ఉపసమనం కలుగుతుంది.
ఎందరో అతిరథమహారధుల, విజ్ఞానవేత్తల, పండితుల మనోభావాలు, హితోక్తులు, సుభాషితాలు పలు పత్రికల్లో పుస్తకాల్లో వెలువడ్డాయి. ఆధ్యాత్మిక చింతన, మంచిని ప్రోత్సహించాలన్న తపన ఉన్నవారి అభ్యున్నతికి మేధావులు చెప్పిన, పత్రికల్లో వెలువడిన అమూల్య విషయాలను సేకరించి చిన్న గుళికల రూపంలో వారి మాటల్లోనే ఏ మార్పు లేకుండా అందించే ప్రయత్నమే ఈ పుస్తకం.
- డా. రాజూరు రామకృష్ణారెడ్డి
కొండంత అనుభవాన్నీ, విజ్ఞానాన్నీ గోరంత ప్రమాణంలో ఉన్న సూక్తులు, హితోక్తులు తమలో ఇముడ్చుకుంటాయి. ఒక చిన్నవిత్తనం మహావృక్షమై, ఫలాలను అందించినట్లే, సూక్తులు గోచరిస్తాయి. సుభాషితాలకు, హితవాక్యాలకు ఉన్న శక్తి దేనికీ ఉండదు. అవి సూక్ష్మ రూపంలో ఉన్నా, అజ్ఞానాన్ని పారద్రోలి, అనుభవాన్ని పండించుకోవడానికి ఉపకరిస్తాయి. ఈ హితవాక్యాలను హృదయంలో పదిలపరచుకున్నవారు సర్వశక్తి సంపన్నులవుతారు. ఔషధం చేదుగా ఉన్నా రోగాన్ని దూరం చేసి, ఆరోగ్యవంతునిగా చేస్తుంది. హితం చెప్పేవారు నూటికీ కోటికీ ఉంటారు. సత్యంలా హితోక్తులు తెలిసినట్టు అనిపించినా, ఎవరికీ పూర్తిగా తెలియవు. జ్ఞానులు మాత్రమే సూక్ష్మసత్యస్పృహ కలిగియుంటారు. మహనీయులు చెప్పిన హితోక్తులు ఏదేశ, కాల, పరిస్థితుల్లోనైనా మానవాళికి ఉపయుక్తమవుతాయి. మనిషి మనస్సు అశాంతి, అలజడి, ఆందోళనతో నిండియున్నప్పుడు వీటిని పఠిస్తే కాసింత ఉపసమనం కలుగుతుంది. ఎందరో అతిరథమహారధుల, విజ్ఞానవేత్తల, పండితుల మనోభావాలు, హితోక్తులు, సుభాషితాలు పలు పత్రికల్లో పుస్తకాల్లో వెలువడ్డాయి. ఆధ్యాత్మిక చింతన, మంచిని ప్రోత్సహించాలన్న తపన ఉన్నవారి అభ్యున్నతికి మేధావులు చెప్పిన, పత్రికల్లో వెలువడిన అమూల్య విషయాలను సేకరించి చిన్న గుళికల రూపంలో వారి మాటల్లోనే ఏ మార్పు లేకుండా అందించే ప్రయత్నమే ఈ పుస్తకం. - డా. రాజూరు రామకృష్ణారెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.