పితృస్వామిక వ్యవస్థలో స్త్రీలమీద జరుగుతున్న అనేకరకాల దోపిడీలను, అన్యాయాలనూ నర్మగర్భంగా విప్పిచెప్పి పాఠకుడిని ఒప్పుదలగా తన మార్గంవైపు నడిపించగల అరుదైన రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి. సూటిగా కథాంశంలోకి వెళ్ళడం, వస్తువునీ, ప్రయోజనాన్నీ దాటి అనవసర ఆడంబర ప్రలోభాల జోలికి వెళ్ళాకపోవడం ఛాయాదేవిలోని ప్రత్యేకత. తనమీద తమకు తెలీకుండానే అమలు కాబడుతోన్న వివక్ష గురించి స్త్రీలకూ పూర్తిగా అవగాహనకు రాకముందే స్త్రీవాదం అన్న పదం ప్రాచుర్యంలోకి రావడానికి చాలాముందే స్త్రీల పక్షాన నిలబడి కథలు రాశారు ఛాయాదేవి.
స్త్రీల స్వేచ్చకు సంబంధించిన అనేక కోణాలను అత్యంత సున్నితంగా చర్చకు పెడతాయి ఛాయాదేవి కథలు. స్త్రీలు తమ లోలోపలి పరాధీనతను తిరస్కరించగలిగి స్వేచ్చగా జీవించాలన్నదే ఛాయాదేవి సాహిత్య అంతస్సూత్రం. స్వార్థ ప్రయోజనాల కోసం, మాసిపోయిన ముఖాలతో మనుషులంతా ఊపిరాడని ధ్యానంలో నిమగ్నమయి ఉన్న వేళ, ఛాయాదేవి వంటి స్వచ్చమైన మనుషులున్న కాలంలో మనమూ ఉండడం, కలిసి జీవించడం, కలిసి నడవడం, స్నేహించడం, సృజించడం నిజంగా ఒక ఉద్వేగంతో కూడిన ఉత్సాహం, గొప్ప పోరాట స్పూర్తి.
పితృస్వామిక వ్యవస్థలో స్త్రీలమీద జరుగుతున్న అనేకరకాల దోపిడీలను, అన్యాయాలనూ నర్మగర్భంగా విప్పిచెప్పి పాఠకుడిని ఒప్పుదలగా తన మార్గంవైపు నడిపించగల అరుదైన రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి. సూటిగా కథాంశంలోకి వెళ్ళడం, వస్తువునీ, ప్రయోజనాన్నీ దాటి అనవసర ఆడంబర ప్రలోభాల జోలికి వెళ్ళాకపోవడం ఛాయాదేవిలోని ప్రత్యేకత. తనమీద తమకు తెలీకుండానే అమలు కాబడుతోన్న వివక్ష గురించి స్త్రీలకూ పూర్తిగా అవగాహనకు రాకముందే స్త్రీవాదం అన్న పదం ప్రాచుర్యంలోకి రావడానికి చాలాముందే స్త్రీల పక్షాన నిలబడి కథలు రాశారు ఛాయాదేవి. స్త్రీల స్వేచ్చకు సంబంధించిన అనేక కోణాలను అత్యంత సున్నితంగా చర్చకు పెడతాయి ఛాయాదేవి కథలు. స్త్రీలు తమ లోలోపలి పరాధీనతను తిరస్కరించగలిగి స్వేచ్చగా జీవించాలన్నదే ఛాయాదేవి సాహిత్య అంతస్సూత్రం. స్వార్థ ప్రయోజనాల కోసం, మాసిపోయిన ముఖాలతో మనుషులంతా ఊపిరాడని ధ్యానంలో నిమగ్నమయి ఉన్న వేళ, ఛాయాదేవి వంటి స్వచ్చమైన మనుషులున్న కాలంలో మనమూ ఉండడం, కలిసి జీవించడం, కలిసి నడవడం, స్నేహించడం, సృజించడం నిజంగా ఒక ఉద్వేగంతో కూడిన ఉత్సాహం, గొప్ప పోరాట స్పూర్తి.© 2017,www.logili.com All Rights Reserved.