అభిశక్తే
ఆ రోజు ఉదయం నుండి ఆకాశం మబ్బులతో నిండి వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది. అప్పటివరకు నిశిత కిరణాలతో నిప్పులు చెరిగిన సూర్యభగవానుడు ఆ రోజు ఎందుకో సేద తీరినట్లు, ప్రాణికోటిపై దయ చూపిస్తున్నట్లు అనిపించింది. గ్రీష్మతాపానికి అల్లాడిన జనులంతా ఆ రోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా తమ తమ పనులలో నిమగ్నులవుతున్నారు. జూన్ నెల కావటం వలన పాఠశాలలు తెరిచే సమయం సమీపిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను వేసవి సెలవుల అనంతరం తిరిగి పాఠశాలలకు పంపటానికి తగిన ఏర్పాట్ల గురించి ఆలోచనలు సాగిస్తున్నారు. క్రొత్తగా పాఠశాలలో చేర్పించవలసిన పిల్లల తల్లిదండ్రులు పాఠశాలల వివరాలు సేకరించే పనిలో నిమగ్నులవుతున్నారు. బాలల సంరక్షణ సమితి సభ్యురాలు సునంద ఆ రోజు కాస్త ముందుగా ఆఫీస్కి చేరుకోవటానికి గబగబ తన పనులు ముగించుకుంటోంది. నిరాశ్రయులు, దారిద్య్రరేఖకు అట్టడుగున ఉన్నవారు తమ పిల్లలను బాలల సంరక్షణ సమితి ద్వారా ప్రభుత్వ సదనాలలో కాని, స్వచ్ఛంద సంస్థల నిర్వహణలో నడపబడుతున్న బాలల సంరక్షణ సంస్థలలో కాని చేర్చటానికి అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. అలా వచ్చిన బాలబాలికలను పరిశీలించి, వారి తల్లిదండ్రుల, కుటుంబ పరిస్థితులను విచారించి సమితి సభ్యులు వారికి తగిన సంరక్షణ కేంద్రాలను జిల్లా స్థాయిలో నిర్ణయించి వారికి సిఫారసు చేసి పంపిస్తారు. అనాధ బాలబాలికలను వారి బంధువులు కాని, బాధ్యత కల వ్యక్తులు కాని వెంటబెట్టుకుని వచ్చి బాలల సంరక్షణ సమితికి అప్పగిస్తారు. ఆ రోజు తమ ముందు హాజరయ్యే పిల్లలకు తగిన న్యాయం చేసే అవకాశం కల్పించమని యథావిధిగా ఆ దేవదేవునికి నమస్కరించుకొని సునంద ఆఫీసుకు చేరుకుంది.
బాహ్య ప్రకృతి ఆహ్లాదకరంగా కనిపించినా, ఏదో తెలియని వాడివేడి చర్చలతో ఆఫీసు వాతావరణం వేడెక్కినట్లుగా అనిపించింది సునందకి. కౌన్సిలర్ రోజా హడావిడిగా తిరుగుతూ కన్పించింది. ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయకుమార్ తన ఎదురుగా కూర్చున్న 16 సంవత్సరాల అమ్మాయిని ఊరడిస్తూ మాట్లాడుతున్నాడు. అత్యంత క్లిష్టమైన కేసు ఏదో ఈ రోజు బాలల సంరక్షణ..................
అభిశక్తే ఆ రోజు ఉదయం నుండి ఆకాశం మబ్బులతో నిండి వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది. అప్పటివరకు నిశిత కిరణాలతో నిప్పులు చెరిగిన సూర్యభగవానుడు ఆ రోజు ఎందుకో సేద తీరినట్లు, ప్రాణికోటిపై దయ చూపిస్తున్నట్లు అనిపించింది. గ్రీష్మతాపానికి అల్లాడిన జనులంతా ఆ రోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా తమ తమ పనులలో నిమగ్నులవుతున్నారు. జూన్ నెల కావటం వలన పాఠశాలలు తెరిచే సమయం సమీపిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను వేసవి సెలవుల అనంతరం తిరిగి పాఠశాలలకు పంపటానికి తగిన ఏర్పాట్ల గురించి ఆలోచనలు సాగిస్తున్నారు. క్రొత్తగా పాఠశాలలో చేర్పించవలసిన పిల్లల తల్లిదండ్రులు పాఠశాలల వివరాలు సేకరించే పనిలో నిమగ్నులవుతున్నారు. బాలల సంరక్షణ సమితి సభ్యురాలు సునంద ఆ రోజు కాస్త ముందుగా ఆఫీస్కి చేరుకోవటానికి గబగబ తన పనులు ముగించుకుంటోంది. నిరాశ్రయులు, దారిద్య్రరేఖకు అట్టడుగున ఉన్నవారు తమ పిల్లలను బాలల సంరక్షణ సమితి ద్వారా ప్రభుత్వ సదనాలలో కాని, స్వచ్ఛంద సంస్థల నిర్వహణలో నడపబడుతున్న బాలల సంరక్షణ సంస్థలలో కాని చేర్చటానికి అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. అలా వచ్చిన బాలబాలికలను పరిశీలించి, వారి తల్లిదండ్రుల, కుటుంబ పరిస్థితులను విచారించి సమితి సభ్యులు వారికి తగిన సంరక్షణ కేంద్రాలను జిల్లా స్థాయిలో నిర్ణయించి వారికి సిఫారసు చేసి పంపిస్తారు. అనాధ బాలబాలికలను వారి బంధువులు కాని, బాధ్యత కల వ్యక్తులు కాని వెంటబెట్టుకుని వచ్చి బాలల సంరక్షణ సమితికి అప్పగిస్తారు. ఆ రోజు తమ ముందు హాజరయ్యే పిల్లలకు తగిన న్యాయం చేసే అవకాశం కల్పించమని యథావిధిగా ఆ దేవదేవునికి నమస్కరించుకొని సునంద ఆఫీసుకు చేరుకుంది. బాహ్య ప్రకృతి ఆహ్లాదకరంగా కనిపించినా, ఏదో తెలియని వాడివేడి చర్చలతో ఆఫీసు వాతావరణం వేడెక్కినట్లుగా అనిపించింది సునందకి. కౌన్సిలర్ రోజా హడావిడిగా తిరుగుతూ కన్పించింది. ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయకుమార్ తన ఎదురుగా కూర్చున్న 16 సంవత్సరాల అమ్మాయిని ఊరడిస్తూ మాట్లాడుతున్నాడు. అత్యంత క్లిష్టమైన కేసు ఏదో ఈ రోజు బాలల సంరక్షణ..................© 2017,www.logili.com All Rights Reserved.