కథకుడుగా పిచ్చేశ్వరరావును గురించి ఒక్క ముక్క చెప్పవచ్చు. అతను గొప్ప కథలు రాయాలని కనిపెట్టుకుని ఏ కథా రాయలేదు. సద్యఃప్రయోజనాన్ని మటుకే మనసులో పెట్టుకుని కథలు రాశాడు... నేనెరిగినంతలో అతని కథలు కనీసం నాలుగైదు ఉత్తమ తెలుగు కథానికా సాహిత్యంలో శాశ్వతంగా నిలవగలిగినవిగా ఉన్నాయి
. - కొడవటిగంటి కుటుంబరావు
మనకు లెక్కలేనన్ని విశ్వవిద్యాలయాలున్నాయి. "తెలుగు కథానికా సాహిత్యంలో సాయుధ దళాల యితివృత్తాలు” అనే అంశాన్ని ఎవరైనా స్వీకరించి పరిశోధనలు చేస్తే పిచ్చేశ్వరరావు నేవీ కథలకు న్యాయం చేకూరుతుంది. ఆ నేపథ్యంలో పిచ్చేశ్వరరావు రచించిన 'చిరంజీవి' కథ మన తెలుగు కథానికా సాహిత్యంలో చిరంజీవే.
- ఆరుద్ర
పిచ్చేశ్వరరావు కథలు రాయడం కొనసాగించి ఉంటే తెలుగు సాహిత్యానికి ఒక 'మార్కెజ్' మిగిలేవాడు. ఈ తరం కథకులకు కథలెలా రాయాలో నేర్పే పాఠాలు ఈ కథలు.
- ఓల్గా
© 2017,www.logili.com All Rights Reserved.