నాగిళ్ళ రామశాస్త్రి
+91 97041 12830
"మంగళం దిశతునో వినాయకా
మంగళం దిశతునః సరస్వతీ ।
మంగళం దిశతు నః సముద్రజా
మంగళం దిశతు నో మహేశ్వరీ ॥"
"వర్ణానా మర్థ సంఘానాం, రసానాంఛందసామపి
మంగళానాంచకర్తా రౌ వందేవాణీ వినాయక"
సనాతన ధర్మము అంటే శాశ్వత ధర్మము. ఇది ప్రాచీన శాసనం. దీనికి వేదములు ప్రాతిపదికలు. వేదములు పవిత్ర గ్రంథాలు. వేలయేండ్ల క్రితం మానవ సమాజానికి లభించిన కానుకలు. ఈ ధర్మాన్ని ఆర్యధర్మమని పిలిచారు. ఈ ధర్మము ఈ జాతికి ఆర్యులచే ప్రసాదించబడినది. ఆర్య అంటే ఉత్తమోత్తమము (Noble). ఈ పేరునే ఆర్యయను ప్రముఖజాతికి ఇవ్వబడింది. గుణగుణాల్లోనూ, ప్రవర్తనల్లోనూ, అభివ్యక్తిలోనూ, వేషభూషల్లోనూ ప్రపంచంలోని ఇతర ధర్మాల కన్న ముందే వెలుగుచూచిన ధర్మమిది. ఈనాటి భారతదేశం ఉత్తరార్థభాగం ఈ ధర్మాన్ని అనుసరించిన మొదటి కుటుంబాల నివాసస్థానం. అందువల్లే ఈ ప్రాంతానికి ఆర్యావర్తమని పేరు వచ్చింది. తూర్పు, పశ్చిమ సముద్రాల మధ్య హిమాలయాలు, వింధ్య శ్రేణుల మధ్య గల ప్రదేశము ఆర్యావర్తము. క్రమముగా దక్షిణాపథమునకూ వ్యాపించిన ధర్మమిది. తరువాతి కాలంలో హిందూ ధర్మము అనుపేరుతో వ్యవహారంలోకి వచ్చింది. ఇది అత్యంత ప్రాచీనమైన ధర్మము, హిందూధర్మములో పునీతులైన పలువురు మహానీయులైన ఋషులు, మునులు, అధ్యాపకులు, రచయితలు, దేశభక్తుల జన్మస్థలి ఈ దేశం. ఈనాటి తరం వారి అంతస్థుకు ఎదిగితేనే ఆ మహోత్తమ ధర్మము సమాజాల సంక్షేమాన్ని సుగమం చేస్తుంది. వారంతా మనకు ఆదర్శనీయులు.
సనాతన ధర్మము - మూలాలు:
ఈ సనాతన ధర్మము బలిష్టమైన పునాదులపై, నిర్మితమైన ఒక భవనము వంటిది. ఈ పునాదియే శృతి. అంటే విన్నది. ఈ భవనగోడలు స్మృతులు అంటే జ్ఞప్తియందుంచుకొనబడినవి అని అర్ధం.
వరిష్ఠ జ్ఞాననేత్రాలుగల వారి నుండి శ్రుతులు మనకు లభించినవి. వారు దేవతల నుండి (పరబ్రహ్మము) వీటిని వినుట ద్వారా స్వీకరించారు. ఇవి అత్యంత పవిత్రమైనవి. ఆధునిక కాలం వరకు వీటిని ఎవరూ రాసియుండలేదు. కాని అవి కంఠస్థం, హృదస్థం చేయబడినవి. నిరంతరం అనుస్యూతంగా వల్లె వేయబడినవి.
గురువు వీటిని శిష్యులకు పాడి వినిపించాడు. శిష్యులు గురువును అనుసరించి వాటిని పదే పదే వల్లె వేసారు. వారికి కంఠస్థం అయ్యే వరకు వల్లె వేసారు. మన తాతముత్తాతలు కూడా ప్రాచీనకాలంలో ఇదే విధంగా కంఠస్థం చేసారు. వాటిని ఈనాడు వేద పాఠశాలల్లో గురువుల నుండి శిష్యులు నేర్చుకుంటున్నారు.
'శ్రుతి' 'చతుర్వేదముల' సమూహము. అంటే నాలుగు వేదములు రాశి. 'వేద' అను మాటకు 'జ్ఞానము' అని అర్ధము. అంటే తెలియబడినది. ఈ జ్ఞానమే మన ధర్మమునకు పునాది. అందువల్ల వేదాలు మన ధర్మమునకు పునాదులని పెద్దలంటారు. ఇవే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము మరియు ఆధర్వణవేదము.....................
సనాతన ధర్మము నాగిళ్ళ రామశాస్త్రి +91 97041 12830 "మంగళం దిశతునో వినాయకా మంగళం దిశతునః సరస్వతీ । మంగళం దిశతు నః సముద్రజా మంగళం దిశతు నో మహేశ్వరీ ॥" "వర్ణానా మర్థ సంఘానాం, రసానాంఛందసామపిమంగళానాంచకర్తా రౌ వందేవాణీ వినాయక" సనాతన ధర్మము అంటే శాశ్వత ధర్మము. ఇది ప్రాచీన శాసనం. దీనికి వేదములు ప్రాతిపదికలు. వేదములు పవిత్ర గ్రంథాలు. వేలయేండ్ల క్రితం మానవ సమాజానికి లభించిన కానుకలు. ఈ ధర్మాన్ని ఆర్యధర్మమని పిలిచారు. ఈ ధర్మము ఈ జాతికి ఆర్యులచే ప్రసాదించబడినది. ఆర్య అంటే ఉత్తమోత్తమము (Noble). ఈ పేరునే ఆర్యయను ప్రముఖజాతికి ఇవ్వబడింది. గుణగుణాల్లోనూ, ప్రవర్తనల్లోనూ, అభివ్యక్తిలోనూ, వేషభూషల్లోనూ ప్రపంచంలోని ఇతర ధర్మాల కన్న ముందే వెలుగుచూచిన ధర్మమిది. ఈనాటి భారతదేశం ఉత్తరార్థభాగం ఈ ధర్మాన్ని అనుసరించిన మొదటి కుటుంబాల నివాసస్థానం. అందువల్లే ఈ ప్రాంతానికి ఆర్యావర్తమని పేరు వచ్చింది. తూర్పు, పశ్చిమ సముద్రాల మధ్య హిమాలయాలు, వింధ్య శ్రేణుల మధ్య గల ప్రదేశము ఆర్యావర్తము. క్రమముగా దక్షిణాపథమునకూ వ్యాపించిన ధర్మమిది. తరువాతి కాలంలో హిందూ ధర్మము అనుపేరుతో వ్యవహారంలోకి వచ్చింది. ఇది అత్యంత ప్రాచీనమైన ధర్మము, హిందూధర్మములో పునీతులైన పలువురు మహానీయులైన ఋషులు, మునులు, అధ్యాపకులు, రచయితలు, దేశభక్తుల జన్మస్థలి ఈ దేశం. ఈనాటి తరం వారి అంతస్థుకు ఎదిగితేనే ఆ మహోత్తమ ధర్మము సమాజాల సంక్షేమాన్ని సుగమం చేస్తుంది. వారంతా మనకు ఆదర్శనీయులు. సనాతన ధర్మము - మూలాలు: ఈ సనాతన ధర్మము బలిష్టమైన పునాదులపై, నిర్మితమైన ఒక భవనము వంటిది. ఈ పునాదియే శృతి. అంటే విన్నది. ఈ భవనగోడలు స్మృతులు అంటే జ్ఞప్తియందుంచుకొనబడినవి అని అర్ధం. వరిష్ఠ జ్ఞాననేత్రాలుగల వారి నుండి శ్రుతులు మనకు లభించినవి. వారు దేవతల నుండి (పరబ్రహ్మము) వీటిని వినుట ద్వారా స్వీకరించారు. ఇవి అత్యంత పవిత్రమైనవి. ఆధునిక కాలం వరకు వీటిని ఎవరూ రాసియుండలేదు. కాని అవి కంఠస్థం, హృదస్థం చేయబడినవి. నిరంతరం అనుస్యూతంగా వల్లె వేయబడినవి. గురువు వీటిని శిష్యులకు పాడి వినిపించాడు. శిష్యులు గురువును అనుసరించి వాటిని పదే పదే వల్లె వేసారు. వారికి కంఠస్థం అయ్యే వరకు వల్లె వేసారు. మన తాతముత్తాతలు కూడా ప్రాచీనకాలంలో ఇదే విధంగా కంఠస్థం చేసారు. వాటిని ఈనాడు వేద పాఠశాలల్లో గురువుల నుండి శిష్యులు నేర్చుకుంటున్నారు. 'శ్రుతి' 'చతుర్వేదముల' సమూహము. అంటే నాలుగు వేదములు రాశి. 'వేద' అను మాటకు 'జ్ఞానము' అని అర్ధము. అంటే తెలియబడినది. ఈ జ్ఞానమే మన ధర్మమునకు పునాది. అందువల్ల వేదాలు మన ధర్మమునకు పునాదులని పెద్దలంటారు. ఇవే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము మరియు ఆధర్వణవేదము.....................© 2017,www.logili.com All Rights Reserved.