తెలంగాణ సాహిత్య వైభవాన్ని నేటి తరానికి అందించే ప్రయత్నంలో రామలింగం కధలు ఓ భాగం. తొలి తరంలో ప్రముఖ కథకుడుగా, బహువ్యాసకర్తగా రామలింగం నిలుస్తాడు. ఆయన పలువురు కథా రచయితలకు మార్గదర్శి అన్నది ఈ కథాసంకలనాన్ని చదివితే తెలుస్తుంది. వివిధ ఉద్యోగాల్లో కొనసాగడం కారణంగా తన అనుభవాలను, మధ్యతరగతి జీవితాలను ప్రతిబింబంగా తన కథల్లో మలిచాడు. "కాగితపు పడవలు" అన్న ఈ కథా సంకలనాన్ని ప్రస్తుతం రామలింగం కథలు పేరిట ప్రచురిస్తున్నాం. ఈ కథలను పాఠకలోకానికి అందించే అవకాశం మా 'నవచేతన పబ్లిషింగ్ హౌస్' కు దక్కింది.
ఈ సంపుటిలోని పది కథలు ఆంధ్రప్రదేశ్ అవతరణ కాలం నాటి మధ్యతరగతి జీవితాలను, ఆలోచనలను రికార్డు చేశాయి. హైదరాబాద్ టోపోగ్రఫిని అక్షరీకరించాయి. అంతేకాదు మనల్ని ఈ కథల ద్వారా డిల్లితో పాటు దేశవ్యాప్తంగా తిప్పుకొచ్చాడు. ఆనాటి డిల్లి ఆచార వ్యవహారాలూ, నివాస స్థితిగతులు, ఆంధ్ర వారి సినిమా కల్చర్, ప్రేమ, స్త్రీల మనోభావాలు, హవాభావాన్ని సగిషీలు చెక్కే కళాకారుల మాదిరిగా అక్షర రూపమిచ్చారు. తాను దగ్గర నుండి చూసిన, అనుభవించిన జీవితాలను, ఎదుర్కొన్న ఒడిదుడుకులు, మనసును కలవర పెట్టిన విషయాలను, వెన్నాడిన సన్నివేశాలను ఈ కథల్లో నిక్షిప్తం చేశారు.
- సంగిశెట్టి శ్రీనివాస్
తెలంగాణ సాహిత్య వైభవాన్ని నేటి తరానికి అందించే ప్రయత్నంలో రామలింగం కధలు ఓ భాగం. తొలి తరంలో ప్రముఖ కథకుడుగా, బహువ్యాసకర్తగా రామలింగం నిలుస్తాడు. ఆయన పలువురు కథా రచయితలకు మార్గదర్శి అన్నది ఈ కథాసంకలనాన్ని చదివితే తెలుస్తుంది. వివిధ ఉద్యోగాల్లో కొనసాగడం కారణంగా తన అనుభవాలను, మధ్యతరగతి జీవితాలను ప్రతిబింబంగా తన కథల్లో మలిచాడు. "కాగితపు పడవలు" అన్న ఈ కథా సంకలనాన్ని ప్రస్తుతం రామలింగం కథలు పేరిట ప్రచురిస్తున్నాం. ఈ కథలను పాఠకలోకానికి అందించే అవకాశం మా 'నవచేతన పబ్లిషింగ్ హౌస్' కు దక్కింది. ఈ సంపుటిలోని పది కథలు ఆంధ్రప్రదేశ్ అవతరణ కాలం నాటి మధ్యతరగతి జీవితాలను, ఆలోచనలను రికార్డు చేశాయి. హైదరాబాద్ టోపోగ్రఫిని అక్షరీకరించాయి. అంతేకాదు మనల్ని ఈ కథల ద్వారా డిల్లితో పాటు దేశవ్యాప్తంగా తిప్పుకొచ్చాడు. ఆనాటి డిల్లి ఆచార వ్యవహారాలూ, నివాస స్థితిగతులు, ఆంధ్ర వారి సినిమా కల్చర్, ప్రేమ, స్త్రీల మనోభావాలు, హవాభావాన్ని సగిషీలు చెక్కే కళాకారుల మాదిరిగా అక్షర రూపమిచ్చారు. తాను దగ్గర నుండి చూసిన, అనుభవించిన జీవితాలను, ఎదుర్కొన్న ఒడిదుడుకులు, మనసును కలవర పెట్టిన విషయాలను, వెన్నాడిన సన్నివేశాలను ఈ కథల్లో నిక్షిప్తం చేశారు. - సంగిశెట్టి శ్రీనివాస్© 2017,www.logili.com All Rights Reserved.