మిత్రుడు ఉపాధ్యాయుల గౌరీశంకరరావు కథలు పుస్తక రూపంలో ఎప్పుడో రావలసింది. దశాబ్దాల అనంతరం యిప్పుడు కార్యరూపం దాలుస్తుంది. ఆలస్యంగానైనా పుస్తకం వస్తుందని సంతోషం. 'దశాబ్దాల క్రిందటి కథలుకదా. ప్రాసంగికత వుంటుందా' అని సందేహించనక్కరలేదు. -కథలు ఇప్పుటి కథలు కూడా అనిపించేవే కాబట్టి పుస్తకంగా రావడం అవసరం.
గౌరీశంకరరావు కవి. విశేషించి పద్యకవి. అప్పుడప్పుడూ వచన కవిత రాసినా పద్యకావ్యాలతో పద్యప్రియులనలరించిన పండితకవి. అవధానాలు కూడా నిర్వహించినవాడు. (అతని అవధానం అభ్యాససానికి ఎనిమిది మంది పృచ్ఛకులూ నేనే కావడం నాభాగ్యం) టిక్కబాయి గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మేమిద్దరమూ తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసిన కాలం మేము మరిచిపోలేని బంగారుకాలం. ప్రతిరోజూ సాహిత్య చర్చలతో బడితోటలోని ఒక చెట్టు కింద ఎన్ని పాటలో... ఎన్నెన్ని పద్యాలో... యింకెన్నికధాపఠనాలో, మాతో మల్లిపురం జగదీశ్ కథారచయిత) అప్పుడు సాహిత్య విద్యార్ధిగా. గౌరీశంకరరావుకి ప్రాచీన సాహిత్యం మీద మంచిపట్టువుంది. పద్య రచన అతనికి అలవోకగా నిర్వహించగలిగే ప్రక్రియ. మంచీ చదవరి. (అయితే రాత అంటే కొంచెం ఇద్దకం. అదే లేకపోతే యింకెన్నొకావ్యాలు అతని నుండి వచ్చివుండేవి) భారతంలో కృష్ణుడు' అనే అంశంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందినవాడు, మద్యం ప్రధానంంగా రాసినా వచన కవితను అప్పుడప్పుడూ తడిమినా... కథల్ని కూడా చాలా రాసేడు.
మళ్ళీరా మిత్రుడా...కథల కాలంలోకి....