పాపినేని శివశంకర్ పుట్టింది నెక్కల్లు. చదివింది గుంటూరు. ఉద్యోగం చేసింది తెలుగు అధ్యాపకుడుగా, ప్రధానాచార్యుడుగా తాడికొండ కళాశాలలో. ఊపిరి పీల్చేది సాహిత్యంలో. వెలువరించింది స్తబ్ధత చలనం, సారాంశం కోసం, ఆకుపచ్చని లోకంలో, ఒక ఖడ్గం ఒక పుష్పం కవితా సంపుటులు, సాహిత్యం మౌలిక భావనలు, నిశాంత విమర్శగ్రంథాలు, తల్లీ! నిన్ను దలంచి ప్రాచీన కవిత్వ విశ్లేషణ. ప్రపంచాన్ని దర్శించేది బహుళ తాత్విక దృక్పథంతో.
మనుషులంతా ఒక్కటేనా
ఎవరి రంగు రుచి వాసన వారివే గదా
ఎవరి ఊహల తీపి, కన్నీటి ఉప్పన వారివే గదా
పెద్దల ఆకాంక్షలన్నీ పిల్లలు తీర్చగలరా
ఎవరూ మరొకరి ఆశయాన్ని అనువదించలేరు.
- ధిక్కరించకపోతే దిక్కులు దద్దరిల్లేటట్టు పొలికేక పెట్టకపోతే అది కవిత్వమెట్లా అవుతుంది?
- ఎప్పుడూ ఏదీ పోగొట్టుకోనివాడి కోసం కనీసం ఎప్పుడైనా ఏదన్నా దొరికినవాడి కోసం వెతుకుతున్నా.
- పెద్దగా నేర్పిందేమీ లేదు పలకమీద 'దయ' అనే రెండక్షరాలు రాసి దిద్దించాను.
- జీవితం ఒక అద్భుత పుష్పం వికసించే ప్రక్రియ.
- ఈ సగం చెవిటి ప్రపంచంలో ఎవడు ఎక్కువమందిని తనివిదీరా పిలవగలడో పిలిపించుకోగలడో వాడికి నా వందనాలు.
- ప్రతి మనిషీ బతుకంతా కోర్కెల బరువులతో ఒక కొండనెక్కుతూనే ఉన్నాడు.
- స్త్రీలు భూదేవతలు సూర్యచంద్రులు రెండు స్తనాలైనవాళ్ళు.
పాపినేని శివశంకర్ పుట్టింది నెక్కల్లు. చదివింది గుంటూరు. ఉద్యోగం చేసింది తెలుగు అధ్యాపకుడుగా, ప్రధానాచార్యుడుగా తాడికొండ కళాశాలలో. ఊపిరి పీల్చేది సాహిత్యంలో. వెలువరించింది స్తబ్ధత చలనం, సారాంశం కోసం, ఆకుపచ్చని లోకంలో, ఒక ఖడ్గం ఒక పుష్పం కవితా సంపుటులు, సాహిత్యం మౌలిక భావనలు, నిశాంత విమర్శగ్రంథాలు, తల్లీ! నిన్ను దలంచి ప్రాచీన కవిత్వ విశ్లేషణ. ప్రపంచాన్ని దర్శించేది బహుళ తాత్విక దృక్పథంతో. మనుషులంతా ఒక్కటేనా ఎవరి రంగు రుచి వాసన వారివే గదా ఎవరి ఊహల తీపి, కన్నీటి ఉప్పన వారివే గదా పెద్దల ఆకాంక్షలన్నీ పిల్లలు తీర్చగలరా ఎవరూ మరొకరి ఆశయాన్ని అనువదించలేరు. - ధిక్కరించకపోతే దిక్కులు దద్దరిల్లేటట్టు పొలికేక పెట్టకపోతే అది కవిత్వమెట్లా అవుతుంది? - ఎప్పుడూ ఏదీ పోగొట్టుకోనివాడి కోసం కనీసం ఎప్పుడైనా ఏదన్నా దొరికినవాడి కోసం వెతుకుతున్నా. - పెద్దగా నేర్పిందేమీ లేదు పలకమీద 'దయ' అనే రెండక్షరాలు రాసి దిద్దించాను. - జీవితం ఒక అద్భుత పుష్పం వికసించే ప్రక్రియ. - ఈ సగం చెవిటి ప్రపంచంలో ఎవడు ఎక్కువమందిని తనివిదీరా పిలవగలడో పిలిపించుకోగలడో వాడికి నా వందనాలు. - ప్రతి మనిషీ బతుకంతా కోర్కెల బరువులతో ఒక కొండనెక్కుతూనే ఉన్నాడు. - స్త్రీలు భూదేవతలు సూర్యచంద్రులు రెండు స్తనాలైనవాళ్ళు.© 2017,www.logili.com All Rights Reserved.