పథికులకు దిక్సూచి
'ఇంతియానం' పుస్తకంలోని 45 మంది స్త్రీల యాత్రా కథనాలు చదివాకనే 40 ఏళ్ళ క్రిందటి గ్రీసు రాజధాని ఏథెన్స్ నగర సందర్శన యాత్రా విశేషాలను గుర్తు తెచ్చుకుని రాశానని శాంతిశ్రీ బెనర్జీ గారు రాసిన 'స్నేహానికి సరిహద్దులు లేవు!" అనే వ్యాసంలో చెప్పినప్పుడు నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి అనిపించింది.
ఏమాత్రం ముఖ పరిచయంలేని నాకు ఒకరోజు శాంతిశ్రీ గారు కాల్చేసి తాను చేసిన యాత్రా విశేషాలతో ఒక పుస్తకం తీసుకు వస్తున్నానని, దానికి నన్ను ముందుమాట రాయమని అడిగారు. నాకు నచ్చిన సబ్జెక్టు అవడం, ఆవిడ ఉత్సాహం చూసి తప్పకుండా రాస్తానని చెప్పాను.
ఆరు నెలలుగా ప్రయాణాలు చేయని నాకు శాంతిశ్రీ బెనర్జీ గారి ప్రయాణపు ముచ్చట్లు చదువుతున్నంత సేపు నేను కూడా అక్కడే ఉన్నట్లు, ఆయా ప్రదేశాల్లో తిరుగుతున్నట్లు మనసంతా హుషారుగా, ఉల్లాసంగా అనిపించింది.
పాకిస్తాన్ యువతులతో స్నేహం, మాంసం కొట్టిచ్చే వ్యక్తి నమస్తే పలకరింపులు, ఏథెన్స్ నగరపు న్యూడ్ బీచ్ విశేషాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఆ ప్రయాణంలో జాతి, మతం, కులం, దేశం అనే సరిహద్దులకు అతీతమైన అద్భుతమైన అనుభూతుల గురించి చదువుతుంటే కచ్చితంగా ఒక్కసారైనా మనకూ అక్కడికి వెళ్లాలని అనిపిస్తుంది..................
పథికులకు దిక్సూచి 'ఇంతియానం' పుస్తకంలోని 45 మంది స్త్రీల యాత్రా కథనాలు చదివాకనే 40 ఏళ్ళ క్రిందటి గ్రీసు రాజధాని ఏథెన్స్ నగర సందర్శన యాత్రా విశేషాలను గుర్తు తెచ్చుకుని రాశానని శాంతిశ్రీ బెనర్జీ గారు రాసిన 'స్నేహానికి సరిహద్దులు లేవు!" అనే వ్యాసంలో చెప్పినప్పుడు నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి అనిపించింది. ఏమాత్రం ముఖ పరిచయంలేని నాకు ఒకరోజు శాంతిశ్రీ గారు కాల్చేసి తాను చేసిన యాత్రా విశేషాలతో ఒక పుస్తకం తీసుకు వస్తున్నానని, దానికి నన్ను ముందుమాట రాయమని అడిగారు. నాకు నచ్చిన సబ్జెక్టు అవడం, ఆవిడ ఉత్సాహం చూసి తప్పకుండా రాస్తానని చెప్పాను. ఆరు నెలలుగా ప్రయాణాలు చేయని నాకు శాంతిశ్రీ బెనర్జీ గారి ప్రయాణపు ముచ్చట్లు చదువుతున్నంత సేపు నేను కూడా అక్కడే ఉన్నట్లు, ఆయా ప్రదేశాల్లో తిరుగుతున్నట్లు మనసంతా హుషారుగా, ఉల్లాసంగా అనిపించింది. పాకిస్తాన్ యువతులతో స్నేహం, మాంసం కొట్టిచ్చే వ్యక్తి నమస్తే పలకరింపులు, ఏథెన్స్ నగరపు న్యూడ్ బీచ్ విశేషాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఆ ప్రయాణంలో జాతి, మతం, కులం, దేశం అనే సరిహద్దులకు అతీతమైన అద్భుతమైన అనుభూతుల గురించి చదువుతుంటే కచ్చితంగా ఒక్కసారైనా మనకూ అక్కడికి వెళ్లాలని అనిపిస్తుంది..................© 2017,www.logili.com All Rights Reserved.