మూడు దశాబ్దాలుగా ప్రయాణాలు చేస్తూ ప్రపంచ యాత్రా చరిత్రని, సాహిత్యాన్ని తెలుగు పాఠకులకి ప్రేమగా అందిస్తున్న ప్రొఫెసర్ ఆదినారాయణ కృషి అభినందనీయం. మన పరిసరాల్లో తిరిగినంత సులభంగా ప్రపంచం అంతటా ప్రయాణాలు చేసి, ఆ వైవిధ్యభరితమైన అనుభవాల ద్వారా మనలోని భ్రమణకాంక్షని తీర్చటానికి ఆయన విశ్వప్రయత్న ఫలితమే ఈ "భూభ్రమణ కాంక్ష".
ఈ ప్రపంచం అంతా తయారైంది పరమాణువులతోనే అయినా, 'ప్రయాణాల వల్లనే అది పరిణామం చెందింది' అని నేను నమ్ముతాను. 'ప్రయాణాలే నా ప్రాణవాయువు' అనుకొంటున్న నేను చూడాల్సిన ప్రపంచం చాలా ఉంది. అమ్మ గర్భంలోని ఉమ్మనీటి ఉప్పు సముద్రాలలో ఈదులాడి, ప్రపంచ ప్రజల హృదయ కమలాల కొలనులో జ్ఞానపానం చేశాను. ఎండాకాలపు వడగాలికి కొట్టుకుపోతున్న వొగుడాకులాంటి జీవితం నాది. గగనమే నాకు గమ్యం. గమనమే నాకు మహా ప్రియం. నా ప్రపంచ యాత్రానుభావాల్ని ఒకే పుస్తకంలో తెలుగు పాఠకుడికి అందించాలన్న ఆలోచనకి అక్షర రూపం వచ్చినందుకు ఆనందంగా ఉంది.
- ఆదినారాయణ
మూడు దశాబ్దాలుగా ప్రయాణాలు చేస్తూ ప్రపంచ యాత్రా చరిత్రని, సాహిత్యాన్ని తెలుగు పాఠకులకి ప్రేమగా అందిస్తున్న ప్రొఫెసర్ ఆదినారాయణ కృషి అభినందనీయం. మన పరిసరాల్లో తిరిగినంత సులభంగా ప్రపంచం అంతటా ప్రయాణాలు చేసి, ఆ వైవిధ్యభరితమైన అనుభవాల ద్వారా మనలోని భ్రమణకాంక్షని తీర్చటానికి ఆయన విశ్వప్రయత్న ఫలితమే ఈ "భూభ్రమణ కాంక్ష". ఈ ప్రపంచం అంతా తయారైంది పరమాణువులతోనే అయినా, 'ప్రయాణాల వల్లనే అది పరిణామం చెందింది' అని నేను నమ్ముతాను. 'ప్రయాణాలే నా ప్రాణవాయువు' అనుకొంటున్న నేను చూడాల్సిన ప్రపంచం చాలా ఉంది. అమ్మ గర్భంలోని ఉమ్మనీటి ఉప్పు సముద్రాలలో ఈదులాడి, ప్రపంచ ప్రజల హృదయ కమలాల కొలనులో జ్ఞానపానం చేశాను. ఎండాకాలపు వడగాలికి కొట్టుకుపోతున్న వొగుడాకులాంటి జీవితం నాది. గగనమే నాకు గమ్యం. గమనమే నాకు మహా ప్రియం. నా ప్రపంచ యాత్రానుభావాల్ని ఒకే పుస్తకంలో తెలుగు పాఠకుడికి అందించాలన్న ఆలోచనకి అక్షర రూపం వచ్చినందుకు ఆనందంగా ఉంది. - ఆదినారాయణ
© 2017,www.logili.com All Rights Reserved.