కొత్త ప్రయత్నం
మానవ మేథ సృష్టించిన అత్యున్నత ఆవిష్కరణ భాష. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవ సమూహాలన్నీ 'భాష'ను తమ భావ వ్యక్తీకరణకు సాధనంగా ఏర్పరచుకున్నాయి. ధ్వని ప్రధానమైనది భాష. ఆ సమాజంలోని వ్యక్తుల సమూహ కృషి, ఒడంబడికల ద్వార భాష వినిమయం జరుగుతుంది. కాల ప్రవాహంలో శబ్దాలకు అర్ధాలు మారుతుంటాయి. కొత్త అర్థాలు చేరుతుంటాయి. వాఙ్మయం ఉన్న భాషలకు ఏ కాలానికి ఏ అర్థం ఆ శబ్దం కలిగి ఉందో తెలుసుకోవడం అత్యంత అవసరం. అది తెలియనప్పుడు ఆ వ్యక్తీకరణ ఇచ్చే సంపూర్ణ అర్థాన్ని అదే స్థాయిలో అందుకోలేము. దీనిని గుర్తించే నిఘంటువులు భాషలలో రూపు దిద్దుకున్నాయి.
శబ్దార్థాల జ్ఞానం వ్యవహర్తల భాష సామర్ధ్యాన్ని పెంచుతుంది. సాహిత్య భాష విద్యార్థులకు ఇది మరింత ముఖ్యమైనది. కాలస్పృహ' అన్న అంశంపైన మల్లెగోడ గంగాప్రసాద్ మంచి పరిశోధన చేశారు. ఆ సందర్భంగా వీరి సిద్దాంత వ్యాసం పరీక్షకులుగా నేను చూడటం తటస్థించింది. మంచి విషయం. కాలానికి సంబంధించిన పదాల చర్చ ఉండటం వలన నిఘంటువును నిర్మించమని సూచించడమైనది. గంగాప్రసాద్ గారు ఆ సూచనను నిజాయితీగా తీసుకొని నిఘంటువును నిర్మించి తీసుకొని వచ్చినప్పుడు........................
కొత్త ప్రయత్నం మానవ మేథ సృష్టించిన అత్యున్నత ఆవిష్కరణ భాష. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవ సమూహాలన్నీ 'భాష'ను తమ భావ వ్యక్తీకరణకు సాధనంగా ఏర్పరచుకున్నాయి. ధ్వని ప్రధానమైనది భాష. ఆ సమాజంలోని వ్యక్తుల సమూహ కృషి, ఒడంబడికల ద్వార భాష వినిమయం జరుగుతుంది. కాల ప్రవాహంలో శబ్దాలకు అర్ధాలు మారుతుంటాయి. కొత్త అర్థాలు చేరుతుంటాయి. వాఙ్మయం ఉన్న భాషలకు ఏ కాలానికి ఏ అర్థం ఆ శబ్దం కలిగి ఉందో తెలుసుకోవడం అత్యంత అవసరం. అది తెలియనప్పుడు ఆ వ్యక్తీకరణ ఇచ్చే సంపూర్ణ అర్థాన్ని అదే స్థాయిలో అందుకోలేము. దీనిని గుర్తించే నిఘంటువులు భాషలలో రూపు దిద్దుకున్నాయి. శబ్దార్థాల జ్ఞానం వ్యవహర్తల భాష సామర్ధ్యాన్ని పెంచుతుంది. సాహిత్య భాష విద్యార్థులకు ఇది మరింత ముఖ్యమైనది. కాలస్పృహ' అన్న అంశంపైన మల్లెగోడ గంగాప్రసాద్ మంచి పరిశోధన చేశారు. ఆ సందర్భంగా వీరి సిద్దాంత వ్యాసం పరీక్షకులుగా నేను చూడటం తటస్థించింది. మంచి విషయం. కాలానికి సంబంధించిన పదాల చర్చ ఉండటం వలన నిఘంటువును నిర్మించమని సూచించడమైనది. గంగాప్రసాద్ గారు ఆ సూచనను నిజాయితీగా తీసుకొని నిఘంటువును నిర్మించి తీసుకొని వచ్చినప్పుడు........................© 2017,www.logili.com All Rights Reserved.