కాసిని కథలు, కాసిని కబుర్లు
అడుగు పెట్టిన వెంటనే పిడుగు పడినట్లూ - పాత సామెత
అన్నం పళ్లెంతో టీ వీ ముందు కూచోగానే హారిక్ ప్రకటన వచ్చినట్లు - కొత్త సామెత.*
*
ఓ 40 ఏళ్ళ వ్యక్తి డాక్టర్ దగ్గరకు వెళ్ళి - “డాక్టర్ గారూ, ఎడమ చెయ్యి, గూడ దగ్గర నుండి అరచేతి దాకా సలుపుతోంది. కుడిచేతి వేళ్ళ దగ్గర విపరీతమైన నెప్పి. పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా తగ్గలేదు” అన్నాడు.
"నేను తగ్గిస్తా. కాకపోతే ఓ 20 వేలు మీవి కావు అనుకోవాలి” అన్నాడు డాక్టర్.
“అలాగే. వెంటనే ట్రీట్మెంట్ మొదలెట్టండి” అన్నాడు పేషెంట్.
"ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు. ఆ స్మార్ట్ ఫోన్ విసిరి పారేసి మామూలు బటన్ ఫోన్ కొనుక్కోండి" అన్నాడు డాక్టర్.
*
మా వాళ్ళ అమ్మాయికి కుదిరిన వరుడు బాహ్య సౌందర్యానికి విలువ ఇవ్వని గొప్ప వ్యక్తి. చదువు, సంస్కారం కుటుంబ నేపధ్యం మొదలైన వాటికి ప్రాముఖ్యత ఇచ్చే సంస్కారం గలవాడు.
ఎలా కనిపెట్టావ్?? '
ఆధార్ కార్డులో అమ్మాయి ఫోటో చూసి సరే అన్నాడు!!!!!............
© 2017,www.logili.com All Rights Reserved.