ఈ పద్నాలుగు కథలు పద్నాలుగు జీవితాలు. పుట్టినదాదిగా ఆడవారి జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో? ఎంతో శక్తివంతురాలైనా కూడా అడుగడుగున ఎన్ని రకాల హింసలకు గురై చివరకు ఎట్లా తెల్లారిపోతుందో ప్రతి కథ రూపు కడుతుంది. నెల్లూరు మాండలికంలో మౌఖిక సాంప్రదాయంలో సాగిన ప్రతి కథ విషాదాంతం. మానవ పరిణామ క్రమం - సామాజిక చరిత్ర పురుషులపరంగానే నిర్వచించినట్లనిపిస్తుంది. మాతృస్వామిక వ్యవస్థ పితృస్వామిక వ్యవస్థగా రూపాంతరం చెందిన క్రమం గురించి తగినంత సమాచారం లేనేలేదు. అన్ని దేశాలలో ఇప్పుడు కొనసాగుతున్న వ్యవస్థలన్నీ మొగవాళ్ళ ఆధిపత్యంతో కొనసాగుతున్నవే. అధికారం, ఆస్తి ఇంకా మొగవాడి ఆధీనంలోనే కొనసాగుతున్నాయి. భారత దేశంలో, అందునా గ్రామీణ ప్రాంతాల్లో, ఆడవాళ్ల జీవితం మధ్యయుగాల నాటి బానిస జీవితమే. అలాంటి స్థితిలో - స్త్రీలు తమదికాని ప్రపంచంలో అననుకూల పరిస్థితుల్లో నిలబడి పోరాడటమే స్థూలంగా విజయలక్ష్మి గారి అన్ని కథల సారాంశం.
- అల్లం రాజయ్య
ఈ పద్నాలుగు కథలు పద్నాలుగు జీవితాలు. పుట్టినదాదిగా ఆడవారి జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో? ఎంతో శక్తివంతురాలైనా కూడా అడుగడుగున ఎన్ని రకాల హింసలకు గురై చివరకు ఎట్లా తెల్లారిపోతుందో ప్రతి కథ రూపు కడుతుంది. నెల్లూరు మాండలికంలో మౌఖిక సాంప్రదాయంలో సాగిన ప్రతి కథ విషాదాంతం. మానవ పరిణామ క్రమం - సామాజిక చరిత్ర పురుషులపరంగానే నిర్వచించినట్లనిపిస్తుంది. మాతృస్వామిక వ్యవస్థ పితృస్వామిక వ్యవస్థగా రూపాంతరం చెందిన క్రమం గురించి తగినంత సమాచారం లేనేలేదు. అన్ని దేశాలలో ఇప్పుడు కొనసాగుతున్న వ్యవస్థలన్నీ మొగవాళ్ళ ఆధిపత్యంతో కొనసాగుతున్నవే. అధికారం, ఆస్తి ఇంకా మొగవాడి ఆధీనంలోనే కొనసాగుతున్నాయి. భారత దేశంలో, అందునా గ్రామీణ ప్రాంతాల్లో, ఆడవాళ్ల జీవితం మధ్యయుగాల నాటి బానిస జీవితమే. అలాంటి స్థితిలో - స్త్రీలు తమదికాని ప్రపంచంలో అననుకూల పరిస్థితుల్లో నిలబడి పోరాడటమే స్థూలంగా విజయలక్ష్మి గారి అన్ని కథల సారాంశం. - అల్లం రాజయ్య© 2017,www.logili.com All Rights Reserved.