"కాలుతున్న కట్టెలు" ఇది నా మూడో కథా సంపుటి. ఇందులో పొందు పరచిన 19 కథల్లో ఈ పేరే ఎందుకు పెట్టానంటే నేడు సమాజాన్ని గట్టిగా పట్టి పీడిస్తున్న జటిలమైన సమస్య ఒకటుంది. అది దాదాపు 90 శాతం కుటుంబాల్లో - ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల జీవితాలను అస్థిర, అశాంతి, అల్లకల్లోలాలకు గురి చేస్తుంది. సాఫీగా సాగే సంసార జీవితాన్ని చిన్నా భిన్నం చేస్తుంది. అదే మద్యం రక్కసి.
ప్రభుత్వ సరఫరా మద్యంగా, దగాకోరు, అక్రమమార్గ, ధనర్జనాపరుల నాటుసారాగా, తాడి, ఈత, చెట్లు కరువైన ప్రాంతాల్లో అసలు గీత పారిశ్రామికులను, మోసగించి, అక్రమంగా కల్లు దుకాణాలను, దళారులు తమ చేతుల్లోకి తీసుకొని క్లోరాల్ హైడ్రైట్, డైజోఫాం లాంటి విషకారకమైన మత్తు పదార్థాలు కల్తీ చేసిన కళ్ళు విక్రయాలు మనిషి నాడీ మండలం పై తీవ్ర ప్రభావం చూపించి నిర్వీర్యుణ్ణి చేస్తున్నాయి. పచ్చగా కళకళలాడుతున్న పల్లెటూళ్ళను వల్లకాడుగా మార్చేస్తున్నాయి.
సమాజంలో మనిషి జీవించడానికి, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి నానా రకాల వృత్తులున్నాయి. ఒక్కో కుటుంబం తమ మనుగడకు తమ కనువైన వృత్తిని ఎన్నుకొని దాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ ముందుకు సాగిపోతాడు. ఆ గమనానికి మద్య మహమ్మారి అడుగడుగునా అడ్డుపడుతుందనే నా భావన. తెలంగాణా ప్రజల దీర్ఘకాలపోరాటం తర్వాత వారి కలలు సాకారమవుతున్న శుభ సందర్భంలో ఈ సంపుటి వెలువడడం సందర్భోచితంగా ఉంది.
- కూతురు రాంరెడ్డి
"కాలుతున్న కట్టెలు" ఇది నా మూడో కథా సంపుటి. ఇందులో పొందు పరచిన 19 కథల్లో ఈ పేరే ఎందుకు పెట్టానంటే నేడు సమాజాన్ని గట్టిగా పట్టి పీడిస్తున్న జటిలమైన సమస్య ఒకటుంది. అది దాదాపు 90 శాతం కుటుంబాల్లో - ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల జీవితాలను అస్థిర, అశాంతి, అల్లకల్లోలాలకు గురి చేస్తుంది. సాఫీగా సాగే సంసార జీవితాన్ని చిన్నా భిన్నం చేస్తుంది. అదే మద్యం రక్కసి. ప్రభుత్వ సరఫరా మద్యంగా, దగాకోరు, అక్రమమార్గ, ధనర్జనాపరుల నాటుసారాగా, తాడి, ఈత, చెట్లు కరువైన ప్రాంతాల్లో అసలు గీత పారిశ్రామికులను, మోసగించి, అక్రమంగా కల్లు దుకాణాలను, దళారులు తమ చేతుల్లోకి తీసుకొని క్లోరాల్ హైడ్రైట్, డైజోఫాం లాంటి విషకారకమైన మత్తు పదార్థాలు కల్తీ చేసిన కళ్ళు విక్రయాలు మనిషి నాడీ మండలం పై తీవ్ర ప్రభావం చూపించి నిర్వీర్యుణ్ణి చేస్తున్నాయి. పచ్చగా కళకళలాడుతున్న పల్లెటూళ్ళను వల్లకాడుగా మార్చేస్తున్నాయి. సమాజంలో మనిషి జీవించడానికి, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి నానా రకాల వృత్తులున్నాయి. ఒక్కో కుటుంబం తమ మనుగడకు తమ కనువైన వృత్తిని ఎన్నుకొని దాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ ముందుకు సాగిపోతాడు. ఆ గమనానికి మద్య మహమ్మారి అడుగడుగునా అడ్డుపడుతుందనే నా భావన. తెలంగాణా ప్రజల దీర్ఘకాలపోరాటం తర్వాత వారి కలలు సాకారమవుతున్న శుభ సందర్భంలో ఈ సంపుటి వెలువడడం సందర్భోచితంగా ఉంది. - కూతురు రాంరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.