సాధారణంగా మొదటి కవితాసంపుటంలో అవగాహనలేమిటో కూడిన పంక్తులు పుంఖానుపుంఖాలుగా దొర్లుతుంటాయి. కానీ నీ "బిందువు" ఇందుకు అతీతం. 'కల కరదీపిక కాకపోగా'. 'అక్షర పరిమళం కోల్పోయి' వంటి శీర్షికలు; 'కాబోయే శ్రీ మతికి నమస్కరించి', 'పొగపొయ్యి ముందు' వంటి కవితలు; 'మూలాధారం', 'అస్తమయమూ ఉదయమూ' కవితల్లో కనబరిచిన వస్తు వైవిద్యం అభినందనీయం.
"మనిషి జాడ" లోని చరణాల నిండా మట్టి వాసన, మనిషితనవు వాసన చోదకశక్తులా కవిత్వపు చాళ్ల వెంబడి కదిలిస్తాయి. అదిలిస్తాయి. సన్నివేశం నించి సన్నివేశానికి, సందర్భం నించి సందర్భానికి, దృశ్యం నించి దృశ్య నేపథ్యానికి పాఠకుణ్ని కదిలించుకెళ్లటంలో రామిరెడ్డి తనదైన ప్రత్యేక శైలిని ప్రదర్శిస్తారు.
- ఎమ్మీ రామిరెడ్డి