ప్రయోగ పందిరి మీద మిత్రులు డా బి వి ఎన్ స్వామి కూడా ఒక కొబ్బరాకు పరిచారు. ఇదిగో ఈ కశప ఆయన కొబ్బరాకు. మల్లికార్జున పండితారాధ్యుని 'శివతత్వసారం' మొదలుకొని ఇందూరు పద్య భారతి తెలంగాణ శతకం దాకా 117 కథలకు పద్యాలను కూర్చారు. ఈయన స్వీకరించిన శతకాలలో సంప్రదాయ, ఆధునిక శతకాలు ఉన్నాయి. వీటిలో వేమన పద్యాలకు, సుమతీ శతకానికి ప్రాధాన్యం దక్కడం న్యాయమే. ప్రాచీన పద్యాలకు కూడా సమకాలీన సామాజిక సందర్భాలను కల్పించడం స్వామి వర్తమాన దృక్పథానికి నిదర్శనం..
- ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
కథలన్నీ వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి. శీర్షిక - కథ - పద్యం ఈ మూడు విషయాలు పరస్పర సంబంధం కలిగి నడిచాయి. కశప ఇప్పుడు పొత్తిళ్లలోని పాపాయి. దీన్ని వికాస దశకు తీసుకెళ్ళాలి. అది తెలుగు సాహిత్యలోకపు బాధ్యత. ప్రయోగం చేసిన మిత్రుడు డా బి వి ఎన్ స్వామిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
- డా మచ్చ హరిదాసు
ప్రయోగ పందిరి మీద మిత్రులు డా బి వి ఎన్ స్వామి కూడా ఒక కొబ్బరాకు పరిచారు. ఇదిగో ఈ కశప ఆయన కొబ్బరాకు. మల్లికార్జున పండితారాధ్యుని 'శివతత్వసారం' మొదలుకొని ఇందూరు పద్య భారతి తెలంగాణ శతకం దాకా 117 కథలకు పద్యాలను కూర్చారు. ఈయన స్వీకరించిన శతకాలలో సంప్రదాయ, ఆధునిక శతకాలు ఉన్నాయి. వీటిలో వేమన పద్యాలకు, సుమతీ శతకానికి ప్రాధాన్యం దక్కడం న్యాయమే. ప్రాచీన పద్యాలకు కూడా సమకాలీన సామాజిక సందర్భాలను కల్పించడం స్వామి వర్తమాన దృక్పథానికి నిదర్శనం.. - ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి కథలన్నీ వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి. శీర్షిక - కథ - పద్యం ఈ మూడు విషయాలు పరస్పర సంబంధం కలిగి నడిచాయి. కశప ఇప్పుడు పొత్తిళ్లలోని పాపాయి. దీన్ని వికాస దశకు తీసుకెళ్ళాలి. అది తెలుగు సాహిత్యలోకపు బాధ్యత. ప్రయోగం చేసిన మిత్రుడు డా బి వి ఎన్ స్వామిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. - డా మచ్చ హరిదాసు© 2017,www.logili.com All Rights Reserved.