కథా వార్షిక గురించి ఒక మాట... కథా వార్షిక కోసం ఎన్నిక చేసే కథల విషయంలో మేము ప్రాంతాలనూ, కులాలనూ, వర్గాలనూ, వ్యక్తిగతమైన స్నేహాలనూ, ఆత్మీయతలను పరిగణనలోకి తీసుకోవడం లేదని రచయితలకు, సహృదయ పాఠకులకు మరోసారి మనవి చేసుకుంటున్నాము. కేవలం మంచి కథ కోసం, తెలుగు కథకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన మధుర కథకులు మధురాంతకం రాజారాం స్మృత్యర్థం, కథా సంకలనాలను తెస్తూ ఒక ఉత్తమ కథల సంపుటికి కథాకోకిల పురస్కారం ప్రధానం చేస్తున్నామని, మంచి కథ ఎక్కడున్నా, ఎవరు రాసినా ఆయనకు సంతోషమే. ఈ విషయంలో వారి మనోగతానికి అనుగుణంగానే మేము ఈ పని చేస్తున్నాము.
కథా వార్షిక కోసం ఈ సంవత్సరం వివిధ పత్రికల్లో వచ్చిన కథల్ని ఒకచోట చేర్చి చూసినప్పుడు మాకు కొంత నిరుత్సాహం కలిగింది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి కథల జాబితా కుదించుకుపోయింది. పట్టుమని పది కథల్నయినా పుస్తకంగా తేగలమా అన్న మీమాంస ఎదురైంది. కారణం ఏవో కొన్ని కథలు తప్ప పటిష్టమైన కథలు ఎక్కువ లేకపోవడమే. అయినా వందలాది కథల్ని సాంతం చదివి, వస్తువుతోబాటు శైలీ శిల్పాదుల సమంగా ఒదిగిపోయిన కథల్ని ఏరి మళ్ళీ వాటిని అన్ని కోణాల నుంచీ చర్చించి, పరిశీలించి దాదాపు పది కథల్ని నిగ్గుతేల్చి వాటిని ఈ కథా వర్షికలో చేర్చాము.
కథా వార్షిక గురించి ఒక మాట... కథా వార్షిక కోసం ఎన్నిక చేసే కథల విషయంలో మేము ప్రాంతాలనూ, కులాలనూ, వర్గాలనూ, వ్యక్తిగతమైన స్నేహాలనూ, ఆత్మీయతలను పరిగణనలోకి తీసుకోవడం లేదని రచయితలకు, సహృదయ పాఠకులకు మరోసారి మనవి చేసుకుంటున్నాము. కేవలం మంచి కథ కోసం, తెలుగు కథకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన మధుర కథకులు మధురాంతకం రాజారాం స్మృత్యర్థం, కథా సంకలనాలను తెస్తూ ఒక ఉత్తమ కథల సంపుటికి కథాకోకిల పురస్కారం ప్రధానం చేస్తున్నామని, మంచి కథ ఎక్కడున్నా, ఎవరు రాసినా ఆయనకు సంతోషమే. ఈ విషయంలో వారి మనోగతానికి అనుగుణంగానే మేము ఈ పని చేస్తున్నాము. కథా వార్షిక కోసం ఈ సంవత్సరం వివిధ పత్రికల్లో వచ్చిన కథల్ని ఒకచోట చేర్చి చూసినప్పుడు మాకు కొంత నిరుత్సాహం కలిగింది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి కథల జాబితా కుదించుకుపోయింది. పట్టుమని పది కథల్నయినా పుస్తకంగా తేగలమా అన్న మీమాంస ఎదురైంది. కారణం ఏవో కొన్ని కథలు తప్ప పటిష్టమైన కథలు ఎక్కువ లేకపోవడమే. అయినా వందలాది కథల్ని సాంతం చదివి, వస్తువుతోబాటు శైలీ శిల్పాదుల సమంగా ఒదిగిపోయిన కథల్ని ఏరి మళ్ళీ వాటిని అన్ని కోణాల నుంచీ చర్చించి, పరిశీలించి దాదాపు పది కథల్ని నిగ్గుతేల్చి వాటిని ఈ కథా వర్షికలో చేర్చాము.© 2017,www.logili.com All Rights Reserved.