భారతీయ సంస్కృతి పునాది ద్రావిడ సంస్కృతిలో ఉంది. ద్రావిడ సంస్కృతికి కొంత పూర్వం సమకాలికమైన సమస్త ప్రాచీన సంస్కృతులు అంతరించాయి. కాని మౌలిక ద్రావిడ స్పర్శ అంతరించలేదు. దేశభాషలలో మార్పులు వచ్చాయి. కాని ద్రావిడ సంస్కృతి మౌలిక భావతత్త్వంలో పెద్దగా మార్పులు రాలేదు. దీని గురించి తగినంత పరిశోధన జరుగలేదు. భారతీయ సంస్కృతికి సంబంధించిన శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన, తాత్త్విక, సాహిత్య రంగాలలో ద్రావిడ సంస్కృతి మూల ముద్ర ఇప్పటికీ పదిలంగా ఉంది. దీనికి సజీవ దాఖలా 27 పైగా ఉన్న భాషలతో కూడిన ద్రావిడ కుటుంబంలోని అనేక ఆదిమ తెగల నాగరికతలో సజీవంగా నిక్షిప్తమై కనిపిస్తుంది. వాటి గురించి ఒక్క భాషా దృష్టితో తప్ప మరే ఇతర దృష్టితోను ఆధునిక ప్రపంచానికి పరిచయం కలగలేదు. అతి ప్రాచీనమైన, సుసంపన్నమైన ద్రావిడ భాషా సంస్కృతుల అభివృద్ధికి ప్రత్యేకంగా నెలకొల్పినదే ద్రావిడ విశ్వవిద్యాలయం. ద్రావిడ భాషీయుల మధ్య తగిన భావ సమైక్యతకు వికాసానికి దోహద పడుతున్న ప్రత్యేక సంస్థ ఇది.
- డా. కె. శ్రీదేవి