సుకవి
పద్మభూషణ్, కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా (1895-1971) ఇరవయ్యవ శతాబ్ది తెలుగు కవుల్లోనే కాక, వెయ్యేళ్ళకు పైబడ్డ తెలుగు కవిత్వ చరిత్రలో విశిష్టస్థానం సముపార్జించుకున్న కవి. తన భావనాబలంలోనూ, కవిత్వ ధారలోనూ, సంస్కారయుతమైన పదప్రయోగంలోనూ, సౌష్ఠవపద్యశిల్పంలోనూ మహాకవుల సరసన నిలబడగలిగినవాడు. ముఖ్యంగా సామాజిక అన్యాయాన్ని, కులమతాలు అడ్డుగోడలు వేళ్ళూనుకున్న అవ్యవస్థనీ ప్రశ్నించడంలోనూ, తెలుగు కవిత్వంలో అంతదాకా చోటు దొరకని దళిత జీవనాన్ని కావ్యవస్తువుగా స్వీకరించి, అభాగ్య సోదరుడి పక్షాన నిలబడడంలోనూ ఆయనే మొదటివాడు. శాంతి, అహింసలు ఒకపక్కనా, ప్రపంచాన్ని మార్చాలంటే సాయుధ సంఘర్షణ తప్పదని మరొక పక్కనా దేశంలోనూ ప్రపంచంలోనూ సంభవిస్తున్న పరిణామాల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ, ఆ రెండు దారుల్లోనూ దేన్ని ఎంచుకోవాలని సంఘర్షణపడి చివరికి శాంతి, ప్రేమ, కరుణ, అహింసల మార్గాన్నే ఎంచుకున్నవాడు. ఇంత అవ్యవస్థతో కూడిన ఈ ప్రపంచానికొక సష్టి కర్త వుంటాడా ఉంటే అతడి ఉద్దేశ్యమేమై ఉంటుందని ఎన్నో సార్లు ఈశ్వరుణ్ణి నిలదీసినవాడు. పాతనిబంధనలో యోబులాగా పరమేశ్వరుణ్ణి ప్రశ్నించకుండా ఉండలేకపోయినవాడు. కాని తనకీ, మనిషికీ మధ్య పూజారులూ, పురోహితులూ, మధ్యవర్తులుగా చేరినందువల్ల మాత్రమే దూరం ఏర్పడుతున్నదని గ్రహించి ఈశ్వరుడు నేరుగా తన కుమారుణ్ణి మనుషులమధ్యకు పంపించాడని నమ్మి క్రీస్తు చరిత్రని అజరామర కావ్యంగా..........................
సుకవి పద్మభూషణ్, కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా (1895-1971) ఇరవయ్యవ శతాబ్ది తెలుగు కవుల్లోనే కాక, వెయ్యేళ్ళకు పైబడ్డ తెలుగు కవిత్వ చరిత్రలో విశిష్టస్థానం సముపార్జించుకున్న కవి. తన భావనాబలంలోనూ, కవిత్వ ధారలోనూ, సంస్కారయుతమైన పదప్రయోగంలోనూ, సౌష్ఠవపద్యశిల్పంలోనూ మహాకవుల సరసన నిలబడగలిగినవాడు. ముఖ్యంగా సామాజిక అన్యాయాన్ని, కులమతాలు అడ్డుగోడలు వేళ్ళూనుకున్న అవ్యవస్థనీ ప్రశ్నించడంలోనూ, తెలుగు కవిత్వంలో అంతదాకా చోటు దొరకని దళిత జీవనాన్ని కావ్యవస్తువుగా స్వీకరించి, అభాగ్య సోదరుడి పక్షాన నిలబడడంలోనూ ఆయనే మొదటివాడు. శాంతి, అహింసలు ఒకపక్కనా, ప్రపంచాన్ని మార్చాలంటే సాయుధ సంఘర్షణ తప్పదని మరొక పక్కనా దేశంలోనూ ప్రపంచంలోనూ సంభవిస్తున్న పరిణామాల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ, ఆ రెండు దారుల్లోనూ దేన్ని ఎంచుకోవాలని సంఘర్షణపడి చివరికి శాంతి, ప్రేమ, కరుణ, అహింసల మార్గాన్నే ఎంచుకున్నవాడు. ఇంత అవ్యవస్థతో కూడిన ఈ ప్రపంచానికొక సష్టి కర్త వుంటాడా ఉంటే అతడి ఉద్దేశ్యమేమై ఉంటుందని ఎన్నో సార్లు ఈశ్వరుణ్ణి నిలదీసినవాడు. పాతనిబంధనలో యోబులాగా పరమేశ్వరుణ్ణి ప్రశ్నించకుండా ఉండలేకపోయినవాడు. కాని తనకీ, మనిషికీ మధ్య పూజారులూ, పురోహితులూ, మధ్యవర్తులుగా చేరినందువల్ల మాత్రమే దూరం ఏర్పడుతున్నదని గ్రహించి ఈశ్వరుడు నేరుగా తన కుమారుణ్ణి మనుషులమధ్యకు పంపించాడని నమ్మి క్రీస్తు చరిత్రని అజరామర కావ్యంగా..........................© 2017,www.logili.com All Rights Reserved.