ఈ రోజుల్లో వృద్ధులు తమ జీవితాలలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధుల సమస్య నేటి సామాజిక సమస్య. వృద్ధులు ఏ వర్గం వారైనా, ఏ ప్రాంతంవారైనా వారి సమస్యలు దాదాపు ఒకలాగే ఉంటున్నాయి. వారి సమస్యలను కథల రూపంలో ఎత్తి చూపుతూ పాఠకులకు అవగాహన కలిగిస్తున్న రచయితలకు అభినందనలు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్ సంఘాలు, సభలు, సమావేశాలు నిర్వహించడం ఉచిత వైద్య పరీక్షలు, చికిత్సా శిబిరాలు ఏర్పాటు చేయడం ఆదర్శనీయం. ఇప్పుడు 'మా అమ్మా - నాన్నల కథలు' 37 మంది లబ్ది ప్రతిష్టులైన రచయితలు సంకలనం వెలువరించడం వృద్ధుల సమస్యలను వెలుగులోకి తెచ్చి పాఠకులకు అవగాహన కలిగించడానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నా. మా అమ్మా - నాన్న కథలు సంకలనం వందేళ్ళు నిండిన శ్రీ కె రాఘవగారికి బహుమతిగా అంకితం ఇవ్వడం ద్వారా పెద్దలందరినీ గౌరవించినట్లుగా భావిస్తూ, తెలుగు కథ రచయితల వేదికకు హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతున్నాను.
- ఉప్పల గోపాలరావు
ఈ రోజుల్లో వృద్ధులు తమ జీవితాలలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధుల సమస్య నేటి సామాజిక సమస్య. వృద్ధులు ఏ వర్గం వారైనా, ఏ ప్రాంతంవారైనా వారి సమస్యలు దాదాపు ఒకలాగే ఉంటున్నాయి. వారి సమస్యలను కథల రూపంలో ఎత్తి చూపుతూ పాఠకులకు అవగాహన కలిగిస్తున్న రచయితలకు అభినందనలు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్ సంఘాలు, సభలు, సమావేశాలు నిర్వహించడం ఉచిత వైద్య పరీక్షలు, చికిత్సా శిబిరాలు ఏర్పాటు చేయడం ఆదర్శనీయం. ఇప్పుడు 'మా అమ్మా - నాన్నల కథలు' 37 మంది లబ్ది ప్రతిష్టులైన రచయితలు సంకలనం వెలువరించడం వృద్ధుల సమస్యలను వెలుగులోకి తెచ్చి పాఠకులకు అవగాహన కలిగించడానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నా. మా అమ్మా - నాన్న కథలు సంకలనం వందేళ్ళు నిండిన శ్రీ కె రాఘవగారికి బహుమతిగా అంకితం ఇవ్వడం ద్వారా పెద్దలందరినీ గౌరవించినట్లుగా భావిస్తూ, తెలుగు కథ రచయితల వేదికకు హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతున్నాను. - ఉప్పల గోపాలరావు© 2017,www.logili.com All Rights Reserved.