బుద్ధధర్మాన్ని తెలుసుకునేటందుకు, మన దేహమే మనకు ఆలంబనగా వుంటుంది. తల్లిదండ్రులకన్న బంధుమిత్రు గురువుల కన్న "భిక్షూ! నీ మనసే నీకు అతి దగ్గర' అన్నాడు బుద్ధుడు.
మనిషి అంటే ఎవరు ? మనిషి అంటే ప్రాధమికంగా దేహం. మనసు అనేది ఆ దేహంలోని శక్తి యొక్క ప్రకటన. అనుభవజ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకునే శక్తి కూడా దానికి వుంది.
దేహం అంటే పదార్థ రూపమే తప్ప, వేరు కాదు అంటాడాయన. ఏ ప్రాణి అయినా, ఏ దేహం అయినా పాంచభౌతిక స్వరూపాలు అయిన గాలి, నీరు, అగ్ని, మట్టి, ఆకాశం (ఖాళీ లేక శూన్యప్రదేశం) అనే అయిదింటితో తయారవుతుంది.
ఏ పదార్థమూ శాశ్వతంగా ఒకే విధంగా వుండదు. అది నిరంతరం చలిస్తూ, మార్పులకి లోనవుతూ వుంటుంది. మనం 'మృత్యువు' అనుకునేది, ఆ దేహ పదార్ధాల
యొక్క మార్పు మాత్రమే. ఆ దేహపదార్థాలన్నీ విచ్ఛిన్నమై, తిరిగి పాంచభౌతిక స్వరూపాలుగా విడిపోతాయి.
'మనం పీల్చే గాలి, ఎన్నెన్ని జీవుల, భూమండలం అంతా నిండిన ప్రాకృతిక జీవ, నిర్జీవ విశ్వశక్తుల నుండి వస్తూ వున్నదో మనం తేల్చలేము. నీరు కూడా అంతే. అది ఆవిరిగా మారి, మబ్బుల్లా ఏర్పడి ప్రపంచం అంతా తిరుగుతూ, మనకు ఒకానొక వానగా కురుస్తుంది. ఇందులోని ఏ నీటి బొట్టు ఏ జీవి నుంచి వెడలి, చివరకిలా వానలా పరిణమించిందో అది కూడా మనం ఊహించలేము. అలాగే మనం తీసుకుంటున్న ఆహారం ఏ గాలి, ఏ నీరు, ఏ పృధ్వీశక్తులతో తయారైతే మనం భుజిస్తున్నామో కూడా మనం తెలుసుకోలేము. ఈ ప్రపంచం అంతా యిలా ఏది దేని నుండి ఉద్భవించుతూ, ఎటువంటి మార్పులు తీసుకుంటూ వున్నదో మానవమేధ చెప్పలేని సంక్లిష్ట సూత్రాలతో నిండి వుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యీ ప్రపంచంలోని ఏ పదార్థమూ, అలా ఒక దాని నుంచి ఒకటి ఏర్పడుతూ, మారుతూ, విడిపోతూ, కలుస్తూ విడిపోతూ నిరంతరమార్పులు శక్తి ప్రహేళికగా వున్నప్పటికీ, ప్రకృతిలోని తమ పంచభూతాల నిష్పత్తిని ఏవీ కోల్పోవు. ఆ నిష్పత్తులు అలాగే వుంటాయి.
బుద్ధుడు రెండువేల ఆరువందల సంవత్సరాల క్రిందటే, మహాసంకలంలో.............
బుద్ధధర్మం -మానవదేహం బుద్ధధర్మాన్ని తెలుసుకునేటందుకు, మన దేహమే మనకు ఆలంబనగా వుంటుంది. తల్లిదండ్రులకన్న బంధుమిత్రు గురువుల కన్న "భిక్షూ! నీ మనసే నీకు అతి దగ్గర' అన్నాడు బుద్ధుడు. మనిషి అంటే ఎవరు ? మనిషి అంటే ప్రాధమికంగా దేహం. మనసు అనేది ఆ దేహంలోని శక్తి యొక్క ప్రకటన. అనుభవజ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకునే శక్తి కూడా దానికి వుంది. దేహం అంటే పదార్థ రూపమే తప్ప, వేరు కాదు అంటాడాయన. ఏ ప్రాణి అయినా, ఏ దేహం అయినా పాంచభౌతిక స్వరూపాలు అయిన గాలి, నీరు, అగ్ని, మట్టి, ఆకాశం (ఖాళీ లేక శూన్యప్రదేశం) అనే అయిదింటితో తయారవుతుంది. ఏ పదార్థమూ శాశ్వతంగా ఒకే విధంగా వుండదు. అది నిరంతరం చలిస్తూ, మార్పులకి లోనవుతూ వుంటుంది. మనం 'మృత్యువు' అనుకునేది, ఆ దేహ పదార్ధాల యొక్క మార్పు మాత్రమే. ఆ దేహపదార్థాలన్నీ విచ్ఛిన్నమై, తిరిగి పాంచభౌతిక స్వరూపాలుగా విడిపోతాయి. 'మనం పీల్చే గాలి, ఎన్నెన్ని జీవుల, భూమండలం అంతా నిండిన ప్రాకృతిక జీవ, నిర్జీవ విశ్వశక్తుల నుండి వస్తూ వున్నదో మనం తేల్చలేము. నీరు కూడా అంతే. అది ఆవిరిగా మారి, మబ్బుల్లా ఏర్పడి ప్రపంచం అంతా తిరుగుతూ, మనకు ఒకానొక వానగా కురుస్తుంది. ఇందులోని ఏ నీటి బొట్టు ఏ జీవి నుంచి వెడలి, చివరకిలా వానలా పరిణమించిందో అది కూడా మనం ఊహించలేము. అలాగే మనం తీసుకుంటున్న ఆహారం ఏ గాలి, ఏ నీరు, ఏ పృధ్వీశక్తులతో తయారైతే మనం భుజిస్తున్నామో కూడా మనం తెలుసుకోలేము. ఈ ప్రపంచం అంతా యిలా ఏది దేని నుండి ఉద్భవించుతూ, ఎటువంటి మార్పులు తీసుకుంటూ వున్నదో మానవమేధ చెప్పలేని సంక్లిష్ట సూత్రాలతో నిండి వుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యీ ప్రపంచంలోని ఏ పదార్థమూ, అలా ఒక దాని నుంచి ఒకటి ఏర్పడుతూ, మారుతూ, విడిపోతూ, కలుస్తూ విడిపోతూ నిరంతరమార్పులు శక్తి ప్రహేళికగా వున్నప్పటికీ, ప్రకృతిలోని తమ పంచభూతాల నిష్పత్తిని ఏవీ కోల్పోవు. ఆ నిష్పత్తులు అలాగే వుంటాయి. బుద్ధుడు రెండువేల ఆరువందల సంవత్సరాల క్రిందటే, మహాసంకలంలో.............© 2017,www.logili.com All Rights Reserved.