డాక్టర్ శ్రీమతి డి.ఆర్.ఎల్. రాజేశ్వరీ చంద్రజగారి 'మన కథలు' వర్తమాన సమాజానికి నిలువుటద్దాలు. వైజ్ఞానిక, సంగీత, సాహిత్య - రంగాలలో ప్రజ్ఞావంతురాలయిన శ్రీమతి రాజేశ్వరిగారు సమస్యల వాస్తవిక స్వరూపాన్ని చిత్రించిటమే కాక, పరిష్కారాలను కూడా సూచించారు.
సజీవ సమాజం ఒక మహా చైతన్య స్రవంతి - ఒక సమస్య పరిష్కారమవుతూనే, మరొక సమస్య తలెత్తుతుంది. బాల్య వివాహాలు పోయాయనుకుంటే వరకట్న సమస్య వచ్చింది. ఈ నాటికీ, స్త్రీ స్వతంత్ర వ్యక్తిత్వాన్ని సాధించుకొంది. అనుకుందామంటే భావి సమాజానికి మూలస్థంభాలయిన పిల్లల సమస్య భయంకరంగా మొదలయింది. మారిపోయిన ఆర్ధిక వ్యవస్థ, స్త్రీ పురుషులిద్దరూ ఉద్యోగాలు చెయ్యవలసిన అవసరాలు, ఈనాటికీ పూర్తిగా నశించిన పురుషాహంకారం, ఎదుగుతోన్న పిల్లల వ్యక్తిత్వాలను దారుణంగా దెబ్బ తీస్తోంది. తల్లితండ్రుల ప్రేమకి దూరం కావటం - శృతిమించిన స్వాతంత్రం, ప్రమాదం అంచున పరుగులు తీస్తోన్న విశృంఖల మనస్తత్వం - ఇవన్నీ రాజేశ్వరీచంద్రజగారు గొప్పగా చిత్రించారు.
ఒక గాడిలో సాగుతున్న కథా రచనను దారి మళ్ళించి, అత్యంత ప్రమాదకరమైన వర్తమాన సమస్య వైపు - ఆధునిక బాల బాలికల్లో, ఎదుగుతోన్న యువతీయువకుల్లో కనిపిస్తోన్న విచిత్ర మనస్తత్వాల వైపు దృష్టి సారించిన రాజేశ్వరి గారు, అభినందనీయులు ఈ రచయిత్రికి నా హృదయపూర్వక ఆశీస్సులు.
- సి. ఆనందరామం
డాక్టర్ శ్రీమతి డి.ఆర్.ఎల్. రాజేశ్వరీ చంద్రజగారి 'మన కథలు' వర్తమాన సమాజానికి నిలువుటద్దాలు. వైజ్ఞానిక, సంగీత, సాహిత్య - రంగాలలో ప్రజ్ఞావంతురాలయిన శ్రీమతి రాజేశ్వరిగారు సమస్యల వాస్తవిక స్వరూపాన్ని చిత్రించిటమే కాక, పరిష్కారాలను కూడా సూచించారు. సజీవ సమాజం ఒక మహా చైతన్య స్రవంతి - ఒక సమస్య పరిష్కారమవుతూనే, మరొక సమస్య తలెత్తుతుంది. బాల్య వివాహాలు పోయాయనుకుంటే వరకట్న సమస్య వచ్చింది. ఈ నాటికీ, స్త్రీ స్వతంత్ర వ్యక్తిత్వాన్ని సాధించుకొంది. అనుకుందామంటే భావి సమాజానికి మూలస్థంభాలయిన పిల్లల సమస్య భయంకరంగా మొదలయింది. మారిపోయిన ఆర్ధిక వ్యవస్థ, స్త్రీ పురుషులిద్దరూ ఉద్యోగాలు చెయ్యవలసిన అవసరాలు, ఈనాటికీ పూర్తిగా నశించిన పురుషాహంకారం, ఎదుగుతోన్న పిల్లల వ్యక్తిత్వాలను దారుణంగా దెబ్బ తీస్తోంది. తల్లితండ్రుల ప్రేమకి దూరం కావటం - శృతిమించిన స్వాతంత్రం, ప్రమాదం అంచున పరుగులు తీస్తోన్న విశృంఖల మనస్తత్వం - ఇవన్నీ రాజేశ్వరీచంద్రజగారు గొప్పగా చిత్రించారు. ఒక గాడిలో సాగుతున్న కథా రచనను దారి మళ్ళించి, అత్యంత ప్రమాదకరమైన వర్తమాన సమస్య వైపు - ఆధునిక బాల బాలికల్లో, ఎదుగుతోన్న యువతీయువకుల్లో కనిపిస్తోన్న విచిత్ర మనస్తత్వాల వైపు దృష్టి సారించిన రాజేశ్వరి గారు, అభినందనీయులు ఈ రచయిత్రికి నా హృదయపూర్వక ఆశీస్సులు. - సి. ఆనందరామం© 2017,www.logili.com All Rights Reserved.