జాలాది గారి కథలన్నీ మనసు చుట్టూ మనోహరంగా తిరిగాయి. మనం గమనించని చాలా చిన్న చిన్న విషయాలను ఎంతో గొప్పగా చెప్పారు. ప్రతి కథలోనూ ఓ కొత్త విషయం చెప్పారు. ఇలాంటి మంచి కథలు చాలా అరుదుగా మనం చదువుకుంటాము.
'ముత్తైదువ తల్లి తన కూతురు అల్లుడితో సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. అదే ముండమోపి తల్లి తన కూతురు అల్లుడి పక్కలో పడుకుంటే ఓర్వలేదు. కాని మొగుడితో విడిపోయిన అలాంటి తల్లి తన కూతురు కూడా అల్లుడితో విడిపోయి తనకు తోడుగా ఉండాలని కోరుకుంటుంది. నేటి సమాజం పోకడలను కుండ బద్దలు కొట్టిన' గొప్ప రచయిత జాలాదిగారు.
భార్యభర్తల అనుబంధాల గురించి జాలాదిగారు చాలా సున్నితంగా చర్చించారు. ముఖ్యంగా తండ్రి కొడుకుల అనుబంధం గురించి కనీ వినీ ఎరుగని రీతిలో కొన్ని కథలు రాశారు. తెలుగు సాహిత్యంలో ఈ మధ్య కాలంలో ఇంత మంచి కథలు నేను చదవలేదు.
- ఎర్రంశెట్టి సాయి
జాలాది గారి కథలన్నీ మనసు చుట్టూ మనోహరంగా తిరిగాయి. మనం గమనించని చాలా చిన్న చిన్న విషయాలను ఎంతో గొప్పగా చెప్పారు. ప్రతి కథలోనూ ఓ కొత్త విషయం చెప్పారు. ఇలాంటి మంచి కథలు చాలా అరుదుగా మనం చదువుకుంటాము. 'ముత్తైదువ తల్లి తన కూతురు అల్లుడితో సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. అదే ముండమోపి తల్లి తన కూతురు అల్లుడి పక్కలో పడుకుంటే ఓర్వలేదు. కాని మొగుడితో విడిపోయిన అలాంటి తల్లి తన కూతురు కూడా అల్లుడితో విడిపోయి తనకు తోడుగా ఉండాలని కోరుకుంటుంది. నేటి సమాజం పోకడలను కుండ బద్దలు కొట్టిన' గొప్ప రచయిత జాలాదిగారు. భార్యభర్తల అనుబంధాల గురించి జాలాదిగారు చాలా సున్నితంగా చర్చించారు. ముఖ్యంగా తండ్రి కొడుకుల అనుబంధం గురించి కనీ వినీ ఎరుగని రీతిలో కొన్ని కథలు రాశారు. తెలుగు సాహిత్యంలో ఈ మధ్య కాలంలో ఇంత మంచి కథలు నేను చదవలేదు. - ఎర్రంశెట్టి సాయి© 2017,www.logili.com All Rights Reserved.