మనలో ప్రతి ఒక్కరికీ జిజ్ఞాస ఉంటుంది. నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. అలాంటి వాళ్ళు మొదట భౌతిక శాస్త్రాల మీద తమ ధ్యాసను పెడతారు. ఈ ప్రయత్నం దానంతట అదే ఆ మనిషిని ఆధ్యాత్మికత వైపు నడిపిస్తుంది. "బయటకు" పరిశీలన చేసే శక్తి నెమ్మదిగ "అంతర్ముఖ" మవుతుంది. "నేను ఎవరిని? ఈ లోకం లోకి ఎందుకు వచ్చాను? ఎక్కడ నుంచి వచ్చాను? మళ్ళీ వచ్చిన చోటుకే తిరిగి వెళ్తానా?" 'జీవితం' అంటే ఏమిటి? చావు అంటే ఏమిటి? 'అమృతం' అంటే ఏమిటి? ఎంత నేర్చుకున్నా నాకు తృప్తి ఎందుకు కలగడం లేదు? అలాంటి మనిషి భక్తి జ్ఞాన కర్మ మార్గాల్లో దేన్నో ఒక దాన్ని ఎన్నుకోవలసి వస్తుంది. అక్కడ నుంచి సాధన ప్రారంభమవుతుంది.
ప్రశ్నలన్నీ లయమైపోయిన తరువాతే ఆత్మజ్ఞానం కలుగుతుందనీ వివేకం ఉదయిస్తుందనీ ఐహిక బంధాల నుంచి 'ముక్తి' లభిస్తుందనీ అనేకమంది గురువుల మాటలు గుర్తుకు వచ్చి కొంత ఊరటను ప్రసాదిస్తాయి. సత్యశోధనకు తీవ్రంగా ఉపక్రమించే వారిని 'ముముక్షువులు' అనే పేరు ఉన్నట్టు ఈ సాధకులు తెలుసుకుంటారు. నేను అనే చోటు నుంచి బయలుదేరి కార్యకలాపాలకు మూలంగా అర్థం చేసుకుంటాడు. అంతా అందరూ ఒకే ఒక్క దివ్యశక్తి యొక్క చిన్ని చిన్ని అంశాలేనన్న సత్యాన్ని గ్రహిస్తాడు. తన చిన్న జ్యోతిని ఆ పెద్ద జ్యోతితో కలిపేస్తాడు. అదే తాను అవుతాడు. ప్రతీ సాధకుడికి ఈ గ్రంథం ఎంతో అత్యుత్తమ జ్ఞానాన్ని అందిస్తుంది.
- రామ్మోహన్
మనలో ప్రతి ఒక్కరికీ జిజ్ఞాస ఉంటుంది. నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. అలాంటి వాళ్ళు మొదట భౌతిక శాస్త్రాల మీద తమ ధ్యాసను పెడతారు. ఈ ప్రయత్నం దానంతట అదే ఆ మనిషిని ఆధ్యాత్మికత వైపు నడిపిస్తుంది. "బయటకు" పరిశీలన చేసే శక్తి నెమ్మదిగ "అంతర్ముఖ" మవుతుంది. "నేను ఎవరిని? ఈ లోకం లోకి ఎందుకు వచ్చాను? ఎక్కడ నుంచి వచ్చాను? మళ్ళీ వచ్చిన చోటుకే తిరిగి వెళ్తానా?" 'జీవితం' అంటే ఏమిటి? చావు అంటే ఏమిటి? 'అమృతం' అంటే ఏమిటి? ఎంత నేర్చుకున్నా నాకు తృప్తి ఎందుకు కలగడం లేదు? అలాంటి మనిషి భక్తి జ్ఞాన కర్మ మార్గాల్లో దేన్నో ఒక దాన్ని ఎన్నుకోవలసి వస్తుంది. అక్కడ నుంచి సాధన ప్రారంభమవుతుంది. ప్రశ్నలన్నీ లయమైపోయిన తరువాతే ఆత్మజ్ఞానం కలుగుతుందనీ వివేకం ఉదయిస్తుందనీ ఐహిక బంధాల నుంచి 'ముక్తి' లభిస్తుందనీ అనేకమంది గురువుల మాటలు గుర్తుకు వచ్చి కొంత ఊరటను ప్రసాదిస్తాయి. సత్యశోధనకు తీవ్రంగా ఉపక్రమించే వారిని 'ముముక్షువులు' అనే పేరు ఉన్నట్టు ఈ సాధకులు తెలుసుకుంటారు. నేను అనే చోటు నుంచి బయలుదేరి కార్యకలాపాలకు మూలంగా అర్థం చేసుకుంటాడు. అంతా అందరూ ఒకే ఒక్క దివ్యశక్తి యొక్క చిన్ని చిన్ని అంశాలేనన్న సత్యాన్ని గ్రహిస్తాడు. తన చిన్న జ్యోతిని ఆ పెద్ద జ్యోతితో కలిపేస్తాడు. అదే తాను అవుతాడు. ప్రతీ సాధకుడికి ఈ గ్రంథం ఎంతో అత్యుత్తమ జ్ఞానాన్ని అందిస్తుంది. - రామ్మోహన్© 2017,www.logili.com All Rights Reserved.