'నైమిశం' అసలు అరణ్యమే కాదనీ, కనురెప్ప మూసినా తెరిచినా, కాలం మార్పును గమనించక ఉండే స్థితిని, నైమిశారణ్యమంటారని ఒక ఆధ్యాత్మిక సూక్తి. సాధకుడు ఈ స్థితిని ధ్యాన సమాధుల ద్వారానే అందుకోగలదు. కౄరమృగాలు జీవించే ఘోరారణ్యాలలోనైనా, కౄర స్వభావులు నివసించే జనారణ్యాలలోనైనా, మానవ ధర్మాన్ని కనుగొంటూ వుండడం సాధకుని కర్తవ్యం. ఆ కనుగొన్న ధర్మం నిత్యజీవనంలో కర్మాచరణగా రూపొందుతూ వుండడం అవశ్యం. అదే ధర్మ బద్ధమైన జీవితమంటే.
ఇందులో పొందుపరిచిన కథలు, ఇతి వృత్తాలు ప్రపంచంలోని పలు మూలగ్రంథాల నుండి సేకరించినవి. కథ గనక జాగ్రత్తగా వింటే మనిషి అంతకు మునుపు ఉన్నట్లు ఉండలేడంటాడు వ్యాసమహర్షి. వినోదం కోసం చదివినా, ఏదో ఒక కథ, మనిషి పూర్వ సంస్కారాలను, వాసనలనూ ఛేదించుకొని లోనికి చొచ్చుకుపోయి, అనుకోని వేళలో మనసును విస్ఫోటన చెందించవచ్చు.
- నీలంరాజు లక్ష్మీప్రసాద్
'నైమిశం' అసలు అరణ్యమే కాదనీ, కనురెప్ప మూసినా తెరిచినా, కాలం మార్పును గమనించక ఉండే స్థితిని, నైమిశారణ్యమంటారని ఒక ఆధ్యాత్మిక సూక్తి. సాధకుడు ఈ స్థితిని ధ్యాన సమాధుల ద్వారానే అందుకోగలదు. కౄరమృగాలు జీవించే ఘోరారణ్యాలలోనైనా, కౄర స్వభావులు నివసించే జనారణ్యాలలోనైనా, మానవ ధర్మాన్ని కనుగొంటూ వుండడం సాధకుని కర్తవ్యం. ఆ కనుగొన్న ధర్మం నిత్యజీవనంలో కర్మాచరణగా రూపొందుతూ వుండడం అవశ్యం. అదే ధర్మ బద్ధమైన జీవితమంటే. ఇందులో పొందుపరిచిన కథలు, ఇతి వృత్తాలు ప్రపంచంలోని పలు మూలగ్రంథాల నుండి సేకరించినవి. కథ గనక జాగ్రత్తగా వింటే మనిషి అంతకు మునుపు ఉన్నట్లు ఉండలేడంటాడు వ్యాసమహర్షి. వినోదం కోసం చదివినా, ఏదో ఒక కథ, మనిషి పూర్వ సంస్కారాలను, వాసనలనూ ఛేదించుకొని లోనికి చొచ్చుకుపోయి, అనుకోని వేళలో మనసును విస్ఫోటన చెందించవచ్చు. - నీలంరాజు లక్ష్మీప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.