నిన్నటికీ రేపటికీ మధ్య...
“రహీమోళ్ల యింట్లో యీ పొద్దెమీ తినద్దు. నువ్వు తర్పణ మొదలాల. కృష్ణసామి అయివారు వెయ్యిండ్ల పూజారి. పన్నెండుకంతా వాళ్లింటికి పొయ్యి, వెంటబెట్టుకోని రా...” పొగ చూరిన వంటగదిలో కట్టెలపొయ్యి ముందు కూర్చున్న మాణిక్యమ్మ పెద్దగా కేకేసింది
గబగబా స్నానం ముగించి వచ్చిన రాంబాబు, తువ్వాలుతో శరీరాన్ని అరకొరగా తుడుచుకున్న తర్వాత, నిక్కరూ చొక్కా తగిలించుకుని, బొత్తాలు పెట్టుకుంటూ వీధిలోకి పరిగెత్తాడు.
వుత్తర దక్షిణాలుగా వ్యాపించిన వీధికి రెండువైపులా, తూర్పు పడమరలకు అభిముఖంగా, వరసగా రకరకాల యిండ్లున్నాయి. అప్పటికే వీధిలో యెండ పెళ పెళగాయటంతో, వీధికుక్కలు మినహా నర సంచారం కాన రావడం లేదు. నాలుగైదిళ్లు దాటుకున్న తర్వాత వో మిద్దింటి ముందు ఆగాడు రాంబాబు. అక్కడినుంచీ తూర్పుకు చీలుతున్న వీధికేసి రెండు నిమిషాలు పరకా యించి చూశాడు. నేలపైన బండలు పరిచిన ఆ వీధికి రెండువైపులా దాదాపుగా అన్నీ పెరటి వాకిళ్లే కనిపిస్తున్నాయి. కాస్త దూరంలో వో యింటి పెరటికి యెదురుగా, గోతాల పరదా కట్టిన చిన్న వసారా ముందుగా, వీధిలోనే కుంపటి రగిలిస్తూ కూర్చున్న వో నడి వయసు స్త్రీ కేసి కాస్సేపు తేరిపారజూశాడు రాంబాబు. ఆ తరువాత వెనక్కు తిరిగి మిద్దింటిలోకి సాగబారాడు..................
నిన్నటికీ రేపటికీ మధ్య... “రహీమోళ్ల యింట్లో యీ పొద్దెమీ తినద్దు. నువ్వు తర్పణ మొదలాల. కృష్ణసామి అయివారు వెయ్యిండ్ల పూజారి. పన్నెండుకంతా వాళ్లింటికి పొయ్యి, వెంటబెట్టుకోని రా...” పొగ చూరిన వంటగదిలో కట్టెలపొయ్యి ముందు కూర్చున్న మాణిక్యమ్మ పెద్దగా కేకేసింది గబగబా స్నానం ముగించి వచ్చిన రాంబాబు, తువ్వాలుతో శరీరాన్ని అరకొరగా తుడుచుకున్న తర్వాత, నిక్కరూ చొక్కా తగిలించుకుని, బొత్తాలు పెట్టుకుంటూ వీధిలోకి పరిగెత్తాడు. వుత్తర దక్షిణాలుగా వ్యాపించిన వీధికి రెండువైపులా, తూర్పు పడమరలకు అభిముఖంగా, వరసగా రకరకాల యిండ్లున్నాయి. అప్పటికే వీధిలో యెండ పెళ పెళగాయటంతో, వీధికుక్కలు మినహా నర సంచారం కాన రావడం లేదు. నాలుగైదిళ్లు దాటుకున్న తర్వాత వో మిద్దింటి ముందు ఆగాడు రాంబాబు. అక్కడినుంచీ తూర్పుకు చీలుతున్న వీధికేసి రెండు నిమిషాలు పరకా యించి చూశాడు. నేలపైన బండలు పరిచిన ఆ వీధికి రెండువైపులా దాదాపుగా అన్నీ పెరటి వాకిళ్లే కనిపిస్తున్నాయి. కాస్త దూరంలో వో యింటి పెరటికి యెదురుగా, గోతాల పరదా కట్టిన చిన్న వసారా ముందుగా, వీధిలోనే కుంపటి రగిలిస్తూ కూర్చున్న వో నడి వయసు స్త్రీ కేసి కాస్సేపు తేరిపారజూశాడు రాంబాబు. ఆ తరువాత వెనక్కు తిరిగి మిద్దింటిలోకి సాగబారాడు..................
© 2017,www.logili.com All Rights Reserved.