తెలుగు పల్లెలోని నేలబారు మనుషులను ఒకచోట కుప్పబోసి వాళ్ళలో వుండే కొండంత తాత్విక దారిద్రాన్ని తూకం వేసి చెప్పిన నవల ఇది. పెత్తందారీ కులాన్నీ, ఆ కులంలో ఇంకా ప్రత్యేకమైన రాజకీయ వారసత్వపు కుటుంబాన్నీ రెండు పోగులుగా కలిపినట్లే కలిపి, మళ్ళీ విడదీసి దేని ప్రత్యేకతను దానిగా చర్చించిన నవల ఇది. మెడకు గుదిబండై వేలాడే పొద్దుపోని కాలాన్ని పోసుకోలు కబుర్లతోనూ, వేటతోనూ, ఇస్పేటాకుల జూదంతోనూ మేరిపించుకోజూసే దయనీయ సమూహాల తాత్కాలికపు ఆశావహ స్వప్న రాజ్యం ఈ నవల.
ఈ నవల చదువుతున్నప్పుడు నరేంద్ర కథన విస్తృతి మనల్ని ఈ నవలలో వర్ణిత అంశాల వైశాల్యాన్ని, లోటుని కూడా వేరే cultural domain లోకి తీసుకువెళ్తాయి. అంటే, అవి నేను ముందే చెప్పినట్టు literacy domain ని దాటి మనల్ని ఇంకో విశాలమయిన క్షేత్రంలోకి వొక్కో అడుగూ తీసుకువెళ్తాయి. ఈ ప్రభావం అల్లెగోరి అనే ప్రతీకాత్మక అంతరార్థ కథనం ద్వారా సాధ్యపడిందని నాకు అనిపిస్తుంది. ఈ నవలలో చూపిన ప్రదేశాలు, పాత్రలు నవలలో ఒక కీలక దశలో ప్రతీకలుగా మారిపోతాయి. కథ విస్తృతని అవి విశ్వజనీనం చేస్తాయి.
తెలుగు పల్లెలోని నేలబారు మనుషులను ఒకచోట కుప్పబోసి వాళ్ళలో వుండే కొండంత తాత్విక దారిద్రాన్ని తూకం వేసి చెప్పిన నవల ఇది. పెత్తందారీ కులాన్నీ, ఆ కులంలో ఇంకా ప్రత్యేకమైన రాజకీయ వారసత్వపు కుటుంబాన్నీ రెండు పోగులుగా కలిపినట్లే కలిపి, మళ్ళీ విడదీసి దేని ప్రత్యేకతను దానిగా చర్చించిన నవల ఇది. మెడకు గుదిబండై వేలాడే పొద్దుపోని కాలాన్ని పోసుకోలు కబుర్లతోనూ, వేటతోనూ, ఇస్పేటాకుల జూదంతోనూ మేరిపించుకోజూసే దయనీయ సమూహాల తాత్కాలికపు ఆశావహ స్వప్న రాజ్యం ఈ నవల. ఈ నవల చదువుతున్నప్పుడు నరేంద్ర కథన విస్తృతి మనల్ని ఈ నవలలో వర్ణిత అంశాల వైశాల్యాన్ని, లోటుని కూడా వేరే cultural domain లోకి తీసుకువెళ్తాయి. అంటే, అవి నేను ముందే చెప్పినట్టు literacy domain ని దాటి మనల్ని ఇంకో విశాలమయిన క్షేత్రంలోకి వొక్కో అడుగూ తీసుకువెళ్తాయి. ఈ ప్రభావం అల్లెగోరి అనే ప్రతీకాత్మక అంతరార్థ కథనం ద్వారా సాధ్యపడిందని నాకు అనిపిస్తుంది. ఈ నవలలో చూపిన ప్రదేశాలు, పాత్రలు నవలలో ఒక కీలక దశలో ప్రతీకలుగా మారిపోతాయి. కథ విస్తృతని అవి విశ్వజనీనం చేస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.