తెలంగాణ పదజాలం, తెలంగాణ మాండలికం, తెలంగాణ జాతీయాలు నుడికారాలు జాలువారిన నల్లేరు మీద బండినడక, ఆ నడక పక్కన తరులు చిలికించిన “పల్లెపూలవాన”. ఈ పుస్తకంలో పన్నెండు కథలున్నాయి.
పిల్లలు ప్రధాన పాత్రలుగా వుంటూ పెద్దల నిర్ణయాలు, పోకడలు, కుటుంబ పరిస్థితులు, అట్టడుగు జీవితాల అంతర్మధనం ఆవిష్కరించే కథలు ఇవి. ఆయా జీవన విధానంతో సంలీనం కానిదే ఇట్లాంటి కథలు ఎవరూ రాయలేరు. బడుగు బతుకుల, అట్టడుగు బాధల, తెలంగాణ వ్యధా కుటుంబాలను కంటి కందించి ప్రతి సన్నివేశం పండి ఎండిన పచ్చని పంట చదువుతుంటే గుండెల్లో ఎక్కడో మూలన సన్నని సెగల మంట.
- డా. భూపాల్
సుమారు అయిదారు దశాబ్దాల కిందట ఆనాటి బాలసాహిత్య రచయితలు చేసిన సూత్రీకరణలు, వర్గీకరణలు, మార్గదర్శకాలు, నమూనాలు ఆనాటికి అవి ఎంతో గొప్పవి, విలువైనవి. కానీ శరవేగంగా మారుతున్న ఈనాటి ఆధునిక బాల్యానికి వాటినే యథాతథంగా మారని బ్రహ్మపదార్థాల్లాగా భావించడం సరైందేనా? కేవలం నీతి బోధలు చేసే కథలు, బాల్య మాధుర్యాన్ని, సౌందర్యాన్ని మర్యాదలనూ బోధించే అనుకరణల గేయాలూ, పాటలూ, కథలూ మాత్రమే బాల సాహిత్యంలో ఉండాలా? ఎంతకాలమైనా అవే అనగనగా రచనలు, అవే జంతువులు, అవే పాతకాలపు పాత్రలు... అవే మూసలు.... ఈ పరిస్థితి ఇలా కొనసాగుతుండాల్సిందేనా? నిజంగా ఈనాటి బాల సాహిత్య రచనలు పిల్లలకు ఆసక్తికరంగా ఆలోచనలు, జీవన నైపుణ్యాలు నేర్పే విధంగా ఉంటు ఉన్నాయా? వారిలోని ఊహలు, కాల్పినిక శక్తులూ జాగృతం చేసే విధంగా ఉంటున్నాయా? అకాడమీలూ, పరిషత్తులూ విధించిన ఫ్రేమ్ వర్కుల్లో, అవార్డుల కోసం మాత్రమే రచనలు చేసే కొందరు బాలసాహితీవేత్తలు ఎందరు తమ రచనలు తీసుకొని పిల్లలకు చేరుస్తున్నారు? పిల్లలతో మంచి చెడులు చర్చిస్తున్నారు?
- డా|| వి.ఆర్. శర్మ
తెలంగాణ పదజాలం, తెలంగాణ మాండలికం, తెలంగాణ జాతీయాలు నుడికారాలు జాలువారిన నల్లేరు మీద బండినడక, ఆ నడక పక్కన తరులు చిలికించిన “పల్లెపూలవాన”. ఈ పుస్తకంలో పన్నెండు కథలున్నాయి.
పిల్లలు ప్రధాన పాత్రలుగా వుంటూ పెద్దల నిర్ణయాలు, పోకడలు, కుటుంబ పరిస్థితులు, అట్టడుగు జీవితాల అంతర్మధనం ఆవిష్కరించే కథలు ఇవి. ఆయా జీవన విధానంతో సంలీనం కానిదే ఇట్లాంటి కథలు ఎవరూ రాయలేరు. బడుగు బతుకుల, అట్టడుగు బాధల, తెలంగాణ వ్యధా కుటుంబాలను కంటి కందించి ప్రతి సన్నివేశం పండి ఎండిన పచ్చని పంట చదువుతుంటే గుండెల్లో ఎక్కడో మూలన సన్నని సెగల మంట.
- డా. భూపాల్ సుమారు అయిదారు దశాబ్దాల కిందట ఆనాటి బాలసాహిత్య రచయితలు చేసిన సూత్రీకరణలు, వర్గీకరణలు, మార్గదర్శకాలు, నమూనాలు ఆనాటికి అవి ఎంతో గొప్పవి, విలువైనవి. కానీ శరవేగంగా మారుతున్న ఈనాటి ఆధునిక బాల్యానికి వాటినే యథాతథంగా మారని బ్రహ్మపదార్థాల్లాగా భావించడం సరైందేనా? కేవలం నీతి బోధలు చేసే కథలు, బాల్య మాధుర్యాన్ని, సౌందర్యాన్ని మర్యాదలనూ బోధించే అనుకరణల గేయాలూ, పాటలూ, కథలూ మాత్రమే బాల సాహిత్యంలో ఉండాలా? ఎంతకాలమైనా అవే అనగనగా రచనలు, అవే జంతువులు, అవే పాతకాలపు పాత్రలు... అవే మూసలు.... ఈ పరిస్థితి ఇలా కొనసాగుతుండాల్సిందేనా? నిజంగా ఈనాటి బాల సాహిత్య రచనలు పిల్లలకు ఆసక్తికరంగా ఆలోచనలు, జీవన నైపుణ్యాలు నేర్పే విధంగా ఉంటు ఉన్నాయా? వారిలోని ఊహలు, కాల్పినిక శక్తులూ జాగృతం చేసే విధంగా ఉంటున్నాయా? అకాడమీలూ, పరిషత్తులూ విధించిన ఫ్రేమ్ వర్కుల్లో, అవార్డుల కోసం మాత్రమే రచనలు చేసే కొందరు బాలసాహితీవేత్తలు ఎందరు తమ రచనలు తీసుకొని పిల్లలకు చేరుస్తున్నారు? పిల్లలతో మంచి చెడులు చర్చిస్తున్నారు?
- డా|| వి.ఆర్. శర్మ