పోలీస్ రిపోర్ట్ సాహిత్యం కాదు. విలేఖరులు అందించే వార్తావిశేషాల కథనాలు కూడా సాహిత్యం కాదు. ముఖ్యంగా కథ కేవలం ఒక ఘటన యొక్క వివరణాత్మక కథనమే కాకుండా ఆలోచనాత్మకంగా ఉంటూనే ప్రయోజనాత్మక చింతనను పాదుకొల్పుతూ అంతర్గత సౌందర్యంతో నిండిన ఆత్మనుకూడా కలిగి ఉండాలని నేను బలంగా నమ్ముతాను. ఆ క్రమంలో కథ ఒక్కోసారి ఆగిపోతుంది. కొన్నిసార్లు ముగిసిపోతుంది. కథ ఎప్పుడూ ఒక జీవిత శకలాన్ని తీసుకొని కొనసాగే ప్రక్రియే తప్పకుండా. రచయిత ఈ రకమైన జీవిత వ్యవహారాన్ని కథనాత్మకం చేస్తున్నప్పుడు తానే ఉవాచిస్తూ వైశాల్యాన్నంతా ఆవరిస్తూ ఉండకుండా పాఠకుడికి కూడా తగుస్థాయిలో వివేచించే 'స్పేస్'ను ఇవ్వాలని కూడా నేను అనుకుంటాను.
రచయిత ఉచితమైన వస్తువును ఎంచుకున్నట్లైతే అదే కథకు దేహమై తన ఆహార్యాన్నీ, నడకనూ కూర్చుకుని శైలిగా, శిల్పంగా, రూపంగా రూపొంది ప్రవహిస్తూ వస్తుంది. ఐతే ప్రతి కథా ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేసుకున్నట్లో, ఒక విశిష్ట సందర్భాన్ని వీక్షించినట్లో అనిపించి ఒక జ్ఞాపకంగా మిగులకపోతే ఈ కథ పరిపూర్ణం కాదేమో. ఈ అవగాహనతో రాయడానికి ప్రయత్నించిన కథలు ఇవి. పాఠకులు సహృదయతో స్వీకరిస్తారని ఆకాంక్షిస్తూ.....
- రామా చంద్రమౌళి
పోలీస్ రిపోర్ట్ సాహిత్యం కాదు. విలేఖరులు అందించే వార్తావిశేషాల కథనాలు కూడా సాహిత్యం కాదు. ముఖ్యంగా కథ కేవలం ఒక ఘటన యొక్క వివరణాత్మక కథనమే కాకుండా ఆలోచనాత్మకంగా ఉంటూనే ప్రయోజనాత్మక చింతనను పాదుకొల్పుతూ అంతర్గత సౌందర్యంతో నిండిన ఆత్మనుకూడా కలిగి ఉండాలని నేను బలంగా నమ్ముతాను. ఆ క్రమంలో కథ ఒక్కోసారి ఆగిపోతుంది. కొన్నిసార్లు ముగిసిపోతుంది. కథ ఎప్పుడూ ఒక జీవిత శకలాన్ని తీసుకొని కొనసాగే ప్రక్రియే తప్పకుండా. రచయిత ఈ రకమైన జీవిత వ్యవహారాన్ని కథనాత్మకం చేస్తున్నప్పుడు తానే ఉవాచిస్తూ వైశాల్యాన్నంతా ఆవరిస్తూ ఉండకుండా పాఠకుడికి కూడా తగుస్థాయిలో వివేచించే 'స్పేస్'ను ఇవ్వాలని కూడా నేను అనుకుంటాను. రచయిత ఉచితమైన వస్తువును ఎంచుకున్నట్లైతే అదే కథకు దేహమై తన ఆహార్యాన్నీ, నడకనూ కూర్చుకుని శైలిగా, శిల్పంగా, రూపంగా రూపొంది ప్రవహిస్తూ వస్తుంది. ఐతే ప్రతి కథా ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేసుకున్నట్లో, ఒక విశిష్ట సందర్భాన్ని వీక్షించినట్లో అనిపించి ఒక జ్ఞాపకంగా మిగులకపోతే ఈ కథ పరిపూర్ణం కాదేమో. ఈ అవగాహనతో రాయడానికి ప్రయత్నించిన కథలు ఇవి. పాఠకులు సహృదయతో స్వీకరిస్తారని ఆకాంక్షిస్తూ..... - రామా చంద్రమౌళి© 2017,www.logili.com All Rights Reserved.