నవంబరు నెల మొదటి వారం. ఉదయం ఏడు గంటలు అయింది. సికింద్రాబాద్ స్టేషన్ సందడిగా ఉంది. ఒకటో నెంబరు ఫ్లాట్ ఫారం నిండా జనం. హైదరాబాద్ నుండి న్యూడిల్లో వెళ్ళవలసిన ఏ పి ఎక్స్ ప్రెస్ మెల్లిగా వచ్చి ఆగింది. జనం హడావిడిగా రైల్లోకి ఎక్కుతున్నారు. ఏ సి టూ టైర్ దగ్గర జనం లోపలికి వెళ్ళలేక అక్కడే ఆగిపోయారు. 'పదండి, ఆగిపోయారేం? నడవండి టైం అయిపోతుంది' అని అరుపులూ కేకలూ, అయినా ముందుకి వెళ్ళలేకపోతున్నారు. అందుకు కారణం ఏమిటీ అంటే దారి మధ్యలో ఎవరో సామాన్లు అడ్డంగా పెట్టేశారు. చేతులలో సామాన్లతో రైలెక్కిన వారికి అవి అడ్డంగా ఉంది అక్కడ ఆగిపోయారందరూ.
ఏదో అవాంతరం వచ్చిందని ఫ్లాట్ ఫారం మీద నిలబడ్డ వారంతా పరుగున వెళ్లి అటువైపు ద్వారం గుండా కొంతమందీ, పక్కబోగీలోకి మరికొంతమంది ఎక్కేశారు. రైలు కదిలింది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకంలోని 'ఒక ప్రయాణం' కథ చదివి తెలుసుకొనగలరు. కథలూ, నవలలూ, వ్యాసాలూ విస్తృతంగా రాస్తూ తెలుగు సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేస్తున్న నా అభిమాన హాస్య రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి కీర్తి కిరీటంలో ఈ 'పూర్వి' మరో కలికితురాయి అవుతుందని ఆశిస్తూ అభినందనలు.
- సలీం
నవంబరు నెల మొదటి వారం. ఉదయం ఏడు గంటలు అయింది. సికింద్రాబాద్ స్టేషన్ సందడిగా ఉంది. ఒకటో నెంబరు ఫ్లాట్ ఫారం నిండా జనం. హైదరాబాద్ నుండి న్యూడిల్లో వెళ్ళవలసిన ఏ పి ఎక్స్ ప్రెస్ మెల్లిగా వచ్చి ఆగింది. జనం హడావిడిగా రైల్లోకి ఎక్కుతున్నారు. ఏ సి టూ టైర్ దగ్గర జనం లోపలికి వెళ్ళలేక అక్కడే ఆగిపోయారు. 'పదండి, ఆగిపోయారేం? నడవండి టైం అయిపోతుంది' అని అరుపులూ కేకలూ, అయినా ముందుకి వెళ్ళలేకపోతున్నారు. అందుకు కారణం ఏమిటీ అంటే దారి మధ్యలో ఎవరో సామాన్లు అడ్డంగా పెట్టేశారు. చేతులలో సామాన్లతో రైలెక్కిన వారికి అవి అడ్డంగా ఉంది అక్కడ ఆగిపోయారందరూ. ఏదో అవాంతరం వచ్చిందని ఫ్లాట్ ఫారం మీద నిలబడ్డ వారంతా పరుగున వెళ్లి అటువైపు ద్వారం గుండా కొంతమందీ, పక్కబోగీలోకి మరికొంతమంది ఎక్కేశారు. రైలు కదిలింది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకంలోని 'ఒక ప్రయాణం' కథ చదివి తెలుసుకొనగలరు. కథలూ, నవలలూ, వ్యాసాలూ విస్తృతంగా రాస్తూ తెలుగు సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేస్తున్న నా అభిమాన హాస్య రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి కీర్తి కిరీటంలో ఈ 'పూర్వి' మరో కలికితురాయి అవుతుందని ఆశిస్తూ అభినందనలు. - సలీం© 2017,www.logili.com All Rights Reserved.