పొత్తూరి విజయలక్ష్మి గారి రచనా వ్యాసంగం 1982 లో ప్రారంభమైంది. మొదటి నవల 'ప్రేమలేఖ'- 'శ్రీవారికి ప్రేమలేఖ' సినిమాగా వచ్చింది. 250 కథలు, 20 నవలలు రచించారు. 3 సినిమాలు, అనేక టి వి సీరియల్స్, రేడియో నాటికలు, కాలమ్ లకు రచనలు చేశారు. రేడియో ప్రసంగాలు చేశారు. అనేక నవలలు పుస్తకరూపంలో వచ్చాయి. ప్రస్తుతం ఆంధ్రభూమి వారపత్రికలో 'జ్ఞాపకాల జావళి' అనే కలం నిర్వహిస్తున్నారు.
'పొత్తూరి విజయలక్ష్మి హాస్యకథలు', 'చంద్రహాసం', 'మా ఇంటి రామాయణం', 'ఆనందమే అందం', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', 'సన్మానం', స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది సినిమా తియ్యండి, పూర్వి కథా సంపుటాలు వెలువడ్డాయి. విజయలక్ష్మి గారికి 2007 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం లభించింది. అదే సంవత్సరంలో తురగా కృష్ణమోహనరావు స్మారక పురస్కారం లభించింది. 2009 సంవత్సరపు శేషారత్నం స్మారక హస్యకథా పురస్కారం, 2012 లో గృహలక్ష్మి పురస్కారం పొందారు. 2015లో అపురూప హాస్య పురస్కారం, మునిమాణిక్యం నరసింహరావు స్మారక ధర్మనిధి పురస్కారం లభించాయి.
పొత్తూరి విజయలక్ష్మి గారి రచనా వ్యాసంగం 1982 లో ప్రారంభమైంది. మొదటి నవల 'ప్రేమలేఖ'- 'శ్రీవారికి ప్రేమలేఖ' సినిమాగా వచ్చింది. 250 కథలు, 20 నవలలు రచించారు. 3 సినిమాలు, అనేక టి వి సీరియల్స్, రేడియో నాటికలు, కాలమ్ లకు రచనలు చేశారు. రేడియో ప్రసంగాలు చేశారు. అనేక నవలలు పుస్తకరూపంలో వచ్చాయి. ప్రస్తుతం ఆంధ్రభూమి వారపత్రికలో 'జ్ఞాపకాల జావళి' అనే కలం నిర్వహిస్తున్నారు. 'పొత్తూరి విజయలక్ష్మి హాస్యకథలు', 'చంద్రహాసం', 'మా ఇంటి రామాయణం', 'ఆనందమే అందం', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', 'సన్మానం', స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది సినిమా తియ్యండి, పూర్వి కథా సంపుటాలు వెలువడ్డాయి. విజయలక్ష్మి గారికి 2007 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం లభించింది. అదే సంవత్సరంలో తురగా కృష్ణమోహనరావు స్మారక పురస్కారం లభించింది. 2009 సంవత్సరపు శేషారత్నం స్మారక హస్యకథా పురస్కారం, 2012 లో గృహలక్ష్మి పురస్కారం పొందారు. 2015లో అపురూప హాస్య పురస్కారం, మునిమాణిక్యం నరసింహరావు స్మారక ధర్మనిధి పురస్కారం లభించాయి.© 2017,www.logili.com All Rights Reserved.