పరిచయానికి పరిచయం
ఎల్.విజయలక్ష్మి! ఈ పేరు నేటితరానికి... ముఖ్యంగా, యువతకి తెలియదు! ఎందుకంటే, ఆమె ఇవాళి నటికాదు! కొన్ని దశాబ్దాల క్రితం ఆమె పలుభాషలలో నటించారు. అంతేకాదు, ఆమె ప్రస్తుతం సినీరంగంలో ఏక్టివ్ గా లేరు. అంటే ఏ అత్తవేషమో, అమ్మ వేషమో అయినా కనీసం వేయటంలేదు. ఇంకో సంగతి, ఆమె ఇప్పుడు భారతదేశంలో కూడా లేరు. గ్రీన్కార్డు సాధించి ప్రస్తుతం వాషింగ్టన్ నగరంలో హాయిగా నివసిస్తున్నారు. ఆమె వయసు కూడా ఏమంత తక్కువ కాదు! అలాంటి పాతకాలపు నటి గురించి ఈనాటి యువతీయువకులకు తెలిసే అవకాశం ఎంతమాత్రమూ లేదు! అలాంటప్పుడు విజయలక్ష్మి జీవితం-వ్యక్తిత్వవికాసానికి దివ్యసోపానం అని నేనంటే, ఎవరైనా ఏమంటారు? వీడికి పిచ్చెక్కిందని అనుకోరూ?! అయితే, నేనన్నది అస్సలు అబద్ధంకాదు! పైగా నూటికి నూరుపాళ్లూ అక్షరసత్యం కూడానాయె!
ఈనాటి యువతరం తమ కెరీర్ని అందంగా మలుచుకోవడం కోసమై, అనేక వ్యక్తిత్వవికాసగ్రంథాలను శ్రద్ధగా అధ్యయనం చేస్తున్నారు. విజయలక్ష్మి ఒక సజీవ గ్రంథమనే విచిత్రవాస్తవాన్ని ఈ తరం గ్రహించినప్పుడు, సంభ్రమాశ్చర్యాలకు లోనవడం తథ్యం! అది ఎలాగో తెలుసుకునేముందు, ఈ గ్రంథానికి ఒక పరిచయం, ఆ పరిచయాన్ని సైతం శ్రద్ధాసక్తులతో అధ్యయనం చేయడం కూడా అవసరమే!
పరిచయం
నేటి యువతీయువకులకు ఏదో సాధించాలనే 'లక్ష్యం' ఎంతో అధికం! ఆ 'ఏదో'ని ఇదమిత్థంగా నిర్వచించమని ఎవరైనా నిలదీస్తే, వారు ఇచ్చే సమాధానాలు విభిన్నంగా ఉంటాయి. కొందరు ఏ I.A.S.. ఆఫీసరో కావాలని అనవచ్చును! ఇంకొందరు రాజకీయరంగంలో రాణించాలని కోరుకుంటారు. మరికొందరు సాఫ్ట్వేర్ రంగంలో ఓ సుందర్ పిచై స్థాయికో, సత్య నాదెండ్ల స్థాయికో ఎదగాలని కాంక్షిస్తారు. కొంతమంది క్రీడారంగంలో ప్రవేశించి సచిన్ టెండూల్కర్, ధోనీ స్థాయి క్రికెటర్గా వెలుగొందాలని అనుకుంటారు. ఇంకా కొంతమంది చలనచిత్రరంగంలో అడుగుపెట్టి రాత్రికి రాత్రే పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్.టి.ఆరో, విజయదేవరకొందో అయిపోవాలని....................
పరిచయానికి పరిచయం ఎల్.విజయలక్ష్మి! ఈ పేరు నేటితరానికి... ముఖ్యంగా, యువతకి తెలియదు! ఎందుకంటే, ఆమె ఇవాళి నటికాదు! కొన్ని దశాబ్దాల క్రితం ఆమె పలుభాషలలో నటించారు. అంతేకాదు, ఆమె ప్రస్తుతం సినీరంగంలో ఏక్టివ్ గా లేరు. అంటే ఏ అత్తవేషమో, అమ్మ వేషమో అయినా కనీసం వేయటంలేదు. ఇంకో సంగతి, ఆమె ఇప్పుడు భారతదేశంలో కూడా లేరు. గ్రీన్కార్డు సాధించి ప్రస్తుతం వాషింగ్టన్ నగరంలో హాయిగా నివసిస్తున్నారు. ఆమె వయసు కూడా ఏమంత తక్కువ కాదు! అలాంటి పాతకాలపు నటి గురించి ఈనాటి యువతీయువకులకు తెలిసే అవకాశం ఎంతమాత్రమూ లేదు! అలాంటప్పుడు విజయలక్ష్మి జీవితం-వ్యక్తిత్వవికాసానికి దివ్యసోపానం అని నేనంటే, ఎవరైనా ఏమంటారు? వీడికి పిచ్చెక్కిందని అనుకోరూ?! అయితే, నేనన్నది అస్సలు అబద్ధంకాదు! పైగా నూటికి నూరుపాళ్లూ అక్షరసత్యం కూడానాయె! ఈనాటి యువతరం తమ కెరీర్ని అందంగా మలుచుకోవడం కోసమై, అనేక వ్యక్తిత్వవికాసగ్రంథాలను శ్రద్ధగా అధ్యయనం చేస్తున్నారు. విజయలక్ష్మి ఒక సజీవ గ్రంథమనే విచిత్రవాస్తవాన్ని ఈ తరం గ్రహించినప్పుడు, సంభ్రమాశ్చర్యాలకు లోనవడం తథ్యం! అది ఎలాగో తెలుసుకునేముందు, ఈ గ్రంథానికి ఒక పరిచయం, ఆ పరిచయాన్ని సైతం శ్రద్ధాసక్తులతో అధ్యయనం చేయడం కూడా అవసరమే! పరిచయం నేటి యువతీయువకులకు ఏదో సాధించాలనే 'లక్ష్యం' ఎంతో అధికం! ఆ 'ఏదో'ని ఇదమిత్థంగా నిర్వచించమని ఎవరైనా నిలదీస్తే, వారు ఇచ్చే సమాధానాలు విభిన్నంగా ఉంటాయి. కొందరు ఏ I.A.S.. ఆఫీసరో కావాలని అనవచ్చును! ఇంకొందరు రాజకీయరంగంలో రాణించాలని కోరుకుంటారు. మరికొందరు సాఫ్ట్వేర్ రంగంలో ఓ సుందర్ పిచై స్థాయికో, సత్య నాదెండ్ల స్థాయికో ఎదగాలని కాంక్షిస్తారు. కొంతమంది క్రీడారంగంలో ప్రవేశించి సచిన్ టెండూల్కర్, ధోనీ స్థాయి క్రికెటర్గా వెలుగొందాలని అనుకుంటారు. ఇంకా కొంతమంది చలనచిత్రరంగంలో అడుగుపెట్టి రాత్రికి రాత్రే పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్.టి.ఆరో, విజయదేవరకొందో అయిపోవాలని....................© 2017,www.logili.com All Rights Reserved.