పురాణ పాత్రలకు సామాజిక భాష్యకారుడు-
కల్లూరి భాస్కరం
గాంధీకి సమకాలీనంగానూ ఉండి, ఆ తర్వాత కూడా జీవించిన రామ్ - మనోహర్ లోహియా అప్పటి స్వాతంత్ర్యోద్యమ నాయకులందరిలోనూ ఒక విలక్షణమైన ఆకర్షణ, అనేకమంది అనంతర నాయకులకు ఒక విశిష్టమైన స్ఫూర్తికేంద్రం, గొప్ప దార్శనికత నిండిన ఆలోచనాధార. ఆయన అధికారానికి, అధికారంలో ఉన్నవారికి దగ్గరగా ఉన్నా, దూరం పాటిస్తూ నిరంతరం జనానికి దగ్గరగా ఉన్న, జనం మనిషి. నాటి ప్రధాని నెహ్రూకు అతిసన్నిహితులలో ఆయన ఒకడన్న సంగతి ఆయన జీవితచరిత్ర చెబుతుంది. అలహాబాద్లో నెహ్రూ ఇంట తను పొందిన ఆతిథ్యమూ, ఆదరణే గొప్పవని ఆయన చెప్పుకున్నాడు. అదే నెహ్రూపాలనలో ఆయన చెరసాల శిక్ష అనుభవించడం, నెహ్రూపై, బహుశా అందరికంటే ఎక్కువ పదునూ, పారుష్యమూ కలిగిన విమర్శల శూలాలను ప్రయోగించడం ఆయన విలక్షణ వ్యక్తిత్వాన్ని మరింత పట్టిచూపుతాయి. రాజకీయమైన ఆయన ఆలోచనా సరళినే కాక, పురాణ, ఇతిహాస పరిచయం నుంచి పెంపొందిన ఆయన దృష్టికోణాన్ని కూడా వెల్లడించే ఆ ఘట్టం కూడా ఈ పుస్తకంలో ఉంది. దాని గురించి ముందు ముందు చెప్పుకుందాం.
ఆయన వ్యక్తిత్వంలోని బహుముఖ పార్శ్వాలను 'సమత స్వాతంత్య్రం సౌందర్యం' అనే ఈ పుస్తకంలోని ప్రథమవ్యాసంలో ప్రసిద్ధ హిందీ పాత్రికేయుడు డా. ధర్మవీర్ భారతి వివరిస్తాడు. ఈ వ్యాసశీర్షికే లోహియా వ్యక్తిత్వం గురించిన స్థూలచిత్రాన్ని మన ముందు ఉంచుతుంది. మిగతా వ్యాసమంతా అందుకు సంబంధించిన వివరాల సమీకరణమే. ఇతర నాయకులను ఎప్పుడు కలిసినా, వారి ముందు నేనొక మరుగుజ్జుగా కనిపించేవాడిననీ, లోహియాతో గడిపిన కొన్ని క్షణాలే నాలోని భయాన్ని పోగొట్టి నన్నొక సహజమానవునిగా తీర్చిదిద్దాయనీ...........
పురాణ పాత్రలకు సామాజిక భాష్యకారుడు- కల్లూరి భాస్కరం గాంధీకి సమకాలీనంగానూ ఉండి, ఆ తర్వాత కూడా జీవించిన రామ్ - మనోహర్ లోహియా అప్పటి స్వాతంత్ర్యోద్యమ నాయకులందరిలోనూ ఒక విలక్షణమైన ఆకర్షణ, అనేకమంది అనంతర నాయకులకు ఒక విశిష్టమైన స్ఫూర్తికేంద్రం, గొప్ప దార్శనికత నిండిన ఆలోచనాధార. ఆయన అధికారానికి, అధికారంలో ఉన్నవారికి దగ్గరగా ఉన్నా, దూరం పాటిస్తూ నిరంతరం జనానికి దగ్గరగా ఉన్న, జనం మనిషి. నాటి ప్రధాని నెహ్రూకు అతిసన్నిహితులలో ఆయన ఒకడన్న సంగతి ఆయన జీవితచరిత్ర చెబుతుంది. అలహాబాద్లో నెహ్రూ ఇంట తను పొందిన ఆతిథ్యమూ, ఆదరణే గొప్పవని ఆయన చెప్పుకున్నాడు. అదే నెహ్రూపాలనలో ఆయన చెరసాల శిక్ష అనుభవించడం, నెహ్రూపై, బహుశా అందరికంటే ఎక్కువ పదునూ, పారుష్యమూ కలిగిన విమర్శల శూలాలను ప్రయోగించడం ఆయన విలక్షణ వ్యక్తిత్వాన్ని మరింత పట్టిచూపుతాయి. రాజకీయమైన ఆయన ఆలోచనా సరళినే కాక, పురాణ, ఇతిహాస పరిచయం నుంచి పెంపొందిన ఆయన దృష్టికోణాన్ని కూడా వెల్లడించే ఆ ఘట్టం కూడా ఈ పుస్తకంలో ఉంది. దాని గురించి ముందు ముందు చెప్పుకుందాం. ఆయన వ్యక్తిత్వంలోని బహుముఖ పార్శ్వాలను 'సమత స్వాతంత్య్రం సౌందర్యం' అనే ఈ పుస్తకంలోని ప్రథమవ్యాసంలో ప్రసిద్ధ హిందీ పాత్రికేయుడు డా. ధర్మవీర్ భారతి వివరిస్తాడు. ఈ వ్యాసశీర్షికే లోహియా వ్యక్తిత్వం గురించిన స్థూలచిత్రాన్ని మన ముందు ఉంచుతుంది. మిగతా వ్యాసమంతా అందుకు సంబంధించిన వివరాల సమీకరణమే. ఇతర నాయకులను ఎప్పుడు కలిసినా, వారి ముందు నేనొక మరుగుజ్జుగా కనిపించేవాడిననీ, లోహియాతో గడిపిన కొన్ని క్షణాలే నాలోని భయాన్ని పోగొట్టి నన్నొక సహజమానవునిగా తీర్చిదిద్దాయనీ...........© 2017,www.logili.com All Rights Reserved.