ఈ గ్రంథం ఆంగ్లమూలం Why I am a hindu రచయిత శశి థరూర్ భారతదేశపు అత్యంత ప్రతిభగల మేధావుల్లో ఒకరు. ఈ గ్రంథం ప్రపంచంలోని ఘనమైన ప్రాచీన మతాన్ని గురించిలోతుగా వివరిస్తుంది. హిందూ మతంపై రచయిత తనకు గల విశ్వాసాన్ని నిశితంగా పరిశీలిస్తూ, దాని అధ్యయనంలో తలమునకలయ్యారు. అందులో భాగంగా హిందూ మతపు మహాత్ములు ఆదిశంకరుడు, పతంజలి, రామానుజుడు, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస అలా ఇంకెందరో హిందూమత సారాన్ని వడకట్టిన వారి సమాన కృషిని కొనియాడారు. అద్వైత వేదాంతం వంటి హిందూమతపు జలరాశుల్లో ఈదులాడారు. పురుషార్ధాలు, భక్తి వంటి హిందూమతపు తాత్విక భావనల్ని అందరికీ అందుబాటులో వుండే భాషలో వివరిస్తారు; వివేకానందుని మతసామరస్యపు పాఠాల్ని ఎంతో నైపుణ్యంతో పొందుపరిచారు; సాధారణ నమ్మకస్తులు 'అలవాటుగా పాటించే హిందూమతాన్ని' సానుభూతితో అన్వేషించారు. ఆధునిక యుగపు రాజకీయ హిందూమతం ఎలా వెర్రితలలు వేసిందో, అధికారపక్ష సంస్థలు, వాటి అనుచరులు మతం పేరుతో హింసకు పాల్పడిన తీరుతెన్నులూ తేటతెల్లం చేస్తారు. 'హిందూత్వ'ను విశ్లేషించి, దాని పురోగమనాన్ని వివరించి, దీన్దయాళ్ ఉపాధ్యాయ తాత్వికత్వం పై సుదీర్ఘంగా వివరణలు సమకూర్చారు. అతివాద భక్తులపై విరుచుకు పడ్డారు. సనాతన మతవాదులది పై చేయిగా వుండే పక్షంలో ఇప్పటి వరకు కీర్తి శిఖరాలకు చేరుకున్న భారతదేశానికి దాని సంస్కృతికి ముప్పువాటిల్లగలదని హెచ్చరించారు. హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉన్న దేశం అయినందువల్లనే భారతదేశం బహుమతవాద, లౌకిక ప్రజాస్వామ్యంగా మనగల్గుతున్నది అని స్పష్టం చేశారు.
ఇటువంటి దివ్యమైన, సప్రామాణిక గ్రంథాన్ని చదివి దానిపై చర్చలు జరుపుతారని ఆశ. అనువాదం కూడ దానికి తగినట్లుగానే సాగిందని భావిస్తున్నాం.
- శశి థరూర్