పసితనంలో రోడ్డు మీద ఎవరైనా నవ్వుకుంటూ ఉంటే, నన్ను చూసే నవ్వుతున్నారేమో అనుకునే అజ్ఞానం ఉండేది. నన్ను చూసి నవ్వడానికి, నా ఏడుపులో భాగం పంచుకోడానికి ప్రపంచంలో ఎవ్వరికీ ఖాళీ ఉండదనే జ్ఞానం ఏర్పడ్డానికి, బతుకు బడిలో చాలా పాటలే చదవాల్సి వచ్చింది. అంటే నిన్నటి భావన నిన్నటికి నిజం. అది అబద్దం అని ఇవ్వల్టికి తెలిసోస్తే... మనం కాస్త అప్డేట్ అయినట్లు లెక్క! ఒక వయసులో కోప హేతువు... కాస్త వయసు ముదిరాక అవివేకంగా అనిపిస్తుంది. అదే మనలోని మనం అప్డేట్ కావడం! సాఫ్ట్ వేర్ పరిభాషలో 2.0 బతుకులో తుదిశ్వాస వరకూ ఇలా ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్లు వస్తూ ఉంటేనే మంచింది.
- సురేష్ పీళ్లే