మాధవగిరి అన్ని హంగులూ గల పెద్దఊరు. ఊరికి ఉత్తరాన, తూర్పున ఎత్తయిన కొండలు కొండవాలుల్లో ఏవుగా ఎదిగిన చిట్టడువులు. కొండకూ ఊరుకు మధ్య పంటచేలు. దక్షిణాన విశాలమైన పంట చెరువు, పడమట వేణుగోపాలస్వామి ఆలయం. ఊరు మధ్యన ఒక పెద్ద ధర్మసత్రము. దానికి ఆనుకొని పాఠశాల. ఆలయం నుంచి సత్రంకు వచ్చే వీధిలో అంగడి, అంగడి వెనుక వీధిలో ఆలయ మాన్యాలతో బతికే దేవదాసీల వాడ.
వేణుగోపాలస్వామి ఆలయానికి చేరువగా ఎత్తయినా పాటిమట్టి ప్రాంగణంలో రెండంతస్థుల పురాతనమైన మేడ పాటి మట్టిగోడలకు అమర్చిన ఇనుప కెటకెటాల గేటుకు ఇటూ, అటూ తుపాకి చేతపట్టుకుని నిలబడిన బొమ్మలు, ఆ గేటులోంచి మేడకు వెళ్ళే దారికి రెండు పక్కలా, దారికి చలువ పందిళ్ళు కప్పినట్టు ఎదిగిన కొబ్బరి మొక్కలు. ఒక పక్క ధాన్యపుగాదె, మరోపక్క పశువుల శాల. ఆ మేడను ఆ ఊరి జనం, చుట్టు పక్కల గ్రామాల జనం "దివాణం" అంటారు. ఇప్పుడా ఇంట్లో ఉంటున్నది కృష్ణమరాయుడు, అతని తల్లి పార్వతమ్మ. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
మాధవగిరి అన్ని హంగులూ గల పెద్దఊరు. ఊరికి ఉత్తరాన, తూర్పున ఎత్తయిన కొండలు కొండవాలుల్లో ఏవుగా ఎదిగిన చిట్టడువులు. కొండకూ ఊరుకు మధ్య పంటచేలు. దక్షిణాన విశాలమైన పంట చెరువు, పడమట వేణుగోపాలస్వామి ఆలయం. ఊరు మధ్యన ఒక పెద్ద ధర్మసత్రము. దానికి ఆనుకొని పాఠశాల. ఆలయం నుంచి సత్రంకు వచ్చే వీధిలో అంగడి, అంగడి వెనుక వీధిలో ఆలయ మాన్యాలతో బతికే దేవదాసీల వాడ. వేణుగోపాలస్వామి ఆలయానికి చేరువగా ఎత్తయినా పాటిమట్టి ప్రాంగణంలో రెండంతస్థుల పురాతనమైన మేడ పాటి మట్టిగోడలకు అమర్చిన ఇనుప కెటకెటాల గేటుకు ఇటూ, అటూ తుపాకి చేతపట్టుకుని నిలబడిన బొమ్మలు, ఆ గేటులోంచి మేడకు వెళ్ళే దారికి రెండు పక్కలా, దారికి చలువ పందిళ్ళు కప్పినట్టు ఎదిగిన కొబ్బరి మొక్కలు. ఒక పక్క ధాన్యపుగాదె, మరోపక్క పశువుల శాల. ఆ మేడను ఆ ఊరి జనం, చుట్టు పక్కల గ్రామాల జనం "దివాణం" అంటారు. ఇప్పుడా ఇంట్లో ఉంటున్నది కృష్ణమరాయుడు, అతని తల్లి పార్వతమ్మ. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.