పక్షి లెక్కల్లోని సున్నితత్వం, పూల లలితమైన పరిమళం కలబోసుకుంటే యమునా గారి కధలవుతాయి. రాశికన్నా, 'వాసి' ముఖ్యమనుకునే రచయిత్రిగా ఆమె చేసిన సాహితీ సేద్యంలో తొలిపంట 'రెక్కలోచ్చాయి' కథా సంకలనం! ప్రతి రచయితకి విజిటింగ్ కార్డులాంటివి కథా సంకలనాలు. ఈ సంకలనంలోకి మనం కళ్ళు విపార్చి చూసిన తర్వాత, యమునా గారికి ఇంకా మంచి ఉజ్వల భవిష్యత్ ఉందనిపిస్తుంది. ఈమె అన్ని 'కోణాలు' సృశించగలదన్న విశ్వాసం కలుగుతుంది. మానవ సంబంధాల్లోని మాధుర్యాన్ని అక్షరబద్దం చేయడానికి ఈమె 'కలం' చూపిన తహ తహ అడుగడుగునా మనల్ని స్పర్శిస్తూనే ఉంటుంది.
ఇందులో ఒక కథ 'కాలం - నిర్ణయం'. ఆశ్రమాలకు తల్లినో, తండ్రినో తరలించే సంతానాన్ని ఆలోచనల్లో పడేస్తుంది ఈ కథ. 'ఇంట్లో చోటిచ్చారు కానీ మనస్సులో ఇవ్వలేదు. కోడలు, కొడుకు మాట్లాడారు. పిల్లల్ని దగ్గరకు రానివ్వరు' ఇటువంటి స్థితిలో ఆ ఇంట్లో ఉండడం కన్నా ఆశ్రమమే బెటర్ అనే హృదయగత వేదన ఆ తండ్రి స్వరం నంది వింటాం. అది ఆయన 'స్వీయ బాధా, సమాజపు బాధా' అన్నది మీరు కధల్లోకి వెళ్లి చూడాల్సిందే. ఇలా ఈ పుస్తకంలో ఎన్నో మంచి కథలు కలవు. అందరు తప్పక చదవగలరు.
పక్షి లెక్కల్లోని సున్నితత్వం, పూల లలితమైన పరిమళం కలబోసుకుంటే యమునా గారి కధలవుతాయి. రాశికన్నా, 'వాసి' ముఖ్యమనుకునే రచయిత్రిగా ఆమె చేసిన సాహితీ సేద్యంలో తొలిపంట 'రెక్కలోచ్చాయి' కథా సంకలనం! ప్రతి రచయితకి విజిటింగ్ కార్డులాంటివి కథా సంకలనాలు. ఈ సంకలనంలోకి మనం కళ్ళు విపార్చి చూసిన తర్వాత, యమునా గారికి ఇంకా మంచి ఉజ్వల భవిష్యత్ ఉందనిపిస్తుంది. ఈమె అన్ని 'కోణాలు' సృశించగలదన్న విశ్వాసం కలుగుతుంది. మానవ సంబంధాల్లోని మాధుర్యాన్ని అక్షరబద్దం చేయడానికి ఈమె 'కలం' చూపిన తహ తహ అడుగడుగునా మనల్ని స్పర్శిస్తూనే ఉంటుంది. ఇందులో ఒక కథ 'కాలం - నిర్ణయం'. ఆశ్రమాలకు తల్లినో, తండ్రినో తరలించే సంతానాన్ని ఆలోచనల్లో పడేస్తుంది ఈ కథ. 'ఇంట్లో చోటిచ్చారు కానీ మనస్సులో ఇవ్వలేదు. కోడలు, కొడుకు మాట్లాడారు. పిల్లల్ని దగ్గరకు రానివ్వరు' ఇటువంటి స్థితిలో ఆ ఇంట్లో ఉండడం కన్నా ఆశ్రమమే బెటర్ అనే హృదయగత వేదన ఆ తండ్రి స్వరం నంది వింటాం. అది ఆయన 'స్వీయ బాధా, సమాజపు బాధా' అన్నది మీరు కధల్లోకి వెళ్లి చూడాల్సిందే. ఇలా ఈ పుస్తకంలో ఎన్నో మంచి కథలు కలవు. అందరు తప్పక చదవగలరు.© 2017,www.logili.com All Rights Reserved.