లోకాన్ని అర్థం చేసుకోవడం మనిషి ముందున్న అనేక సవాళ్ళలో ఒక ముఖ్యమైన సవాలు. రంగుటద్దాలు తగిలించుకుని రచించే కథలు, నవలలు పాఠకులను తప్పుదారి పట్టిస్తాయి. కానీ, నందిరాజు పద్మలతా జయరాంగారి కథలు వాస్తవికతకు అద్దం పడతాయి. వివేకానికి ప్రాధాన్యం ఇచ్చేవి, మంచిని పంచేవి. మానవులలో కొందరు అవకాశ ఓవాదులు, స్వార్థపరులూ ఉంటారని ఒక పక్క నుండి హెచ్చరించుతూనే, మంచివారూ ఉంటారని, వారిని గుర్తించాలని, వారికి తోడుగా నిలవాలని, వారి సంఖ్యను పెంచాలనీ ప్రబోధించేవి. మొదటి కథ శిశిరశరత్తు చదివేసరికే హృదయం ఆర్ద్రమైంది, కనులు వర్షించాయి. చిన్న చిన్న అంశాల పట్ల కూడా ఎంతో శ్రద్ధ ఉంటే తప్ప ఇటువంటి కథలను సృష్టించలేరు.
లోకాన్ని అర్థం చేసుకోవడం మనిషి ముందున్న అనేక సవాళ్ళలో ఒక ముఖ్యమైన సవాలు. రంగుటద్దాలు తగిలించుకుని రచించే కథలు, నవలలు పాఠకులను తప్పుదారి పట్టిస్తాయి. కానీ, నందిరాజు పద్మలతా జయరాంగారి కథలు వాస్తవికతకు అద్దం పడతాయి. వివేకానికి ప్రాధాన్యం ఇచ్చేవి, మంచిని పంచేవి. మానవులలో కొందరు అవకాశ ఓవాదులు, స్వార్థపరులూ ఉంటారని ఒక పక్క నుండి హెచ్చరించుతూనే, మంచివారూ ఉంటారని, వారిని గుర్తించాలని, వారికి తోడుగా నిలవాలని, వారి సంఖ్యను పెంచాలనీ ప్రబోధించేవి. మొదటి కథ శిశిరశరత్తు చదివేసరికే హృదయం ఆర్ద్రమైంది, కనులు వర్షించాయి. చిన్న చిన్న అంశాల పట్ల కూడా ఎంతో శ్రద్ధ ఉంటే తప్ప ఇటువంటి కథలను సృష్టించలేరు.© 2017,www.logili.com All Rights Reserved.