జీవితం మామూలుగా సాగుతోందనుకొండి. ఏమిటో! కలం కదలదు. ఊహా మెదలదు. అసలు కాలమే కరగదు. అదే అపరిమితమైన ఆనందం కలిగిందనుకోండి. వరదలా దూసుకొచ్చే ఆ ప్రవాహాన్ని ఆపడానికి కాలమూ, కాగితమూ తప్ప మరో ఆసరా దొరకదు. విషాదమూ అంతే! కన్నీరు సిరాగా మారి కాగితంపై వర్షిస్తుంది. అది బలమో, బలహీనతో! ఏమో మరి? స్పందించినపుడు మాత్రమే నేను ఏదో రాయగలను అని గుర్తొస్తుంది. మనస్సు మరీ సున్నితమైనదో ఏమో! అందరికీ యథాలాపంగా అనిపించిన సంఘటనలు సైతం నన్ను స్పృశించి కథలౌతాయి. కథానికలౌతాయి. కకావికలైన మనసు కాగితం పైన కథనంగా వాలుతుంది.
కాల్పనిక కథలు, ఊహించి రాసిన కథలు కావివి. నిజంలోంచి పుట్టిన రచనలు. వర్తమానంలో జరిగే వాస్తవ సంఘటనల అక్షర రూపశిల్పాలు. కలం అనే ఉలితో చక్కగా చేక్కానో లేదో నిర్ణయించే పాఠక చక్రవర్తులకి వినమ్ర వందన శతాలు.
- నందిరాజు పద్మలతా జయరాం
జీవితం మామూలుగా సాగుతోందనుకొండి. ఏమిటో! కలం కదలదు. ఊహా మెదలదు. అసలు కాలమే కరగదు. అదే అపరిమితమైన ఆనందం కలిగిందనుకోండి. వరదలా దూసుకొచ్చే ఆ ప్రవాహాన్ని ఆపడానికి కాలమూ, కాగితమూ తప్ప మరో ఆసరా దొరకదు. విషాదమూ అంతే! కన్నీరు సిరాగా మారి కాగితంపై వర్షిస్తుంది. అది బలమో, బలహీనతో! ఏమో మరి? స్పందించినపుడు మాత్రమే నేను ఏదో రాయగలను అని గుర్తొస్తుంది. మనస్సు మరీ సున్నితమైనదో ఏమో! అందరికీ యథాలాపంగా అనిపించిన సంఘటనలు సైతం నన్ను స్పృశించి కథలౌతాయి. కథానికలౌతాయి. కకావికలైన మనసు కాగితం పైన కథనంగా వాలుతుంది. కాల్పనిక కథలు, ఊహించి రాసిన కథలు కావివి. నిజంలోంచి పుట్టిన రచనలు. వర్తమానంలో జరిగే వాస్తవ సంఘటనల అక్షర రూపశిల్పాలు. కలం అనే ఉలితో చక్కగా చేక్కానో లేదో నిర్ణయించే పాఠక చక్రవర్తులకి వినమ్ర వందన శతాలు. - నందిరాజు పద్మలతా జయరాం© 2017,www.logili.com All Rights Reserved.