శ్రీ కుందా భాస్కరరావు రాసిన ఈ కథలు అలా పుస్తకరూపంలో పదిలం చేయవలసిన మంచి కథలు. హాయిగా సుఖంగా చదివించగల కథలు. దాదాపు అన్ని కథలూ కొసమెరుపుతో ముగుస్తాయి. చిన్నకథని ట్విస్టుతో ముగించడం ఒక గొప్ప టెక్నిక్. ఓ హెన్రీ ఈ టెక్నిక్ ను పరాకాష్టకు తీసుకువెళ్ళాడు. అతని ప్రభావం - మొపాసా, చెకోవ్ ల మాదిరిగానే కుందా భాస్కరరావు లాంటి తెలుగు కథా రచయితల మీద ఉన్నది.
ఈ సంపుటంలోని కథల్లో చాలా భాగం ఆకస్మిక సంఘటనతో, అనుకోని మలుపుతో ముగియడమే కాక ఏదో ఒక నీతితో అంతమవుతాయి. ఒక కథ మానవునిలోని మంచితనాన్ని చూపిస్తే, మరొకటి చెడ్డతనాన్ని చిత్రిస్తుంది. ఇంకొకటి పరివర్తనని సూచిస్తుంది. ఒక కథ మాతృత్వంలోని మాధుర్యాన్ని చూపిస్తే, మరొకటి కుటుంబ నియంత్రణ అవసరాన్ని నాజూగ్గా ఉద్భోదిస్తుంది. కాని, అన్నింటిలోకి నాకు నచ్చిన కథని పేర్కొనమంటే 'గోరంతదీపం' అని వెంటనే చెప్పగలను. ఎందుకంటే - ఎలాగూ చదువుతారుగదా, వేరే నేను చెప్పడందేనికి?
శ్రీ కుందా భాస్కరరావు రాసిన ఈ కథలు అలా పుస్తకరూపంలో పదిలం చేయవలసిన మంచి కథలు. హాయిగా సుఖంగా చదివించగల కథలు. దాదాపు అన్ని కథలూ కొసమెరుపుతో ముగుస్తాయి. చిన్నకథని ట్విస్టుతో ముగించడం ఒక గొప్ప టెక్నిక్. ఓ హెన్రీ ఈ టెక్నిక్ ను పరాకాష్టకు తీసుకువెళ్ళాడు. అతని ప్రభావం - మొపాసా, చెకోవ్ ల మాదిరిగానే కుందా భాస్కరరావు లాంటి తెలుగు కథా రచయితల మీద ఉన్నది. ఈ సంపుటంలోని కథల్లో చాలా భాగం ఆకస్మిక సంఘటనతో, అనుకోని మలుపుతో ముగియడమే కాక ఏదో ఒక నీతితో అంతమవుతాయి. ఒక కథ మానవునిలోని మంచితనాన్ని చూపిస్తే, మరొకటి చెడ్డతనాన్ని చిత్రిస్తుంది. ఇంకొకటి పరివర్తనని సూచిస్తుంది. ఒక కథ మాతృత్వంలోని మాధుర్యాన్ని చూపిస్తే, మరొకటి కుటుంబ నియంత్రణ అవసరాన్ని నాజూగ్గా ఉద్భోదిస్తుంది. కాని, అన్నింటిలోకి నాకు నచ్చిన కథని పేర్కొనమంటే 'గోరంతదీపం' అని వెంటనే చెప్పగలను. ఎందుకంటే - ఎలాగూ చదువుతారుగదా, వేరే నేను చెప్పడందేనికి?© 2017,www.logili.com All Rights Reserved.